అక్కినేని వారి కోడ‌ల్నివేధించిన హీరో

November 30, 2016 at 10:28 am
samantha

నీ సుఖమే నే కోరుకున్నా నిను వీడి అందుకే వెళుతున్నా.. ప్రియురాలి కోసం త‌న ప్రేమ‌ను త్యాగం చేసిన ప్రేమికుడి మ‌న‌సును ఇలా ఆవిష్క‌రించారు ఓ సినీ క‌వి! అయితే ఇదంతా ఒక‌ప్పుడు. ప్రేమించిన అమ్మాయి పెళ్లికి ఒప్పుకోక‌పోతే.. సోష‌ల్ మీడియాలో ఆమెపై విప‌రీత కామెంట్లు చేయ‌డం.. అస‌భ్య ఫొటోలు పెట్ట‌డం చేసి అమ్మాయిని వేధించే వారే ఎక్కువ‌గా క‌నిపిస్తున్నారు. ఇలా బాధ‌ప‌డిన వారిలో చుల్‌బులీ స‌మంత కూడా ఉంద‌ట‌! ఒక యంగ్ హీరో.. స‌మంత‌ను తీవ్రంగా వేధించాడ‌ట‌.

త్వ‌ర‌లో అక్కినేని వారి కోడ‌లు కాబోతున్న స‌మంత ఒక హీరోపై షాకింగ్ కామెంట్స్ చేసింది. రీసెంట్‌గా చుల్‌బులీ ఓ ప్రైవేట్ చానెల్‌కి ఇంట‌ర్‌వ్యూ ఇచ్చింది. ఇందులో యాంక‌ర్… మీరు ఇబ్బంది ప‌డిన సంద‌ర్భాలు ఏవ‌యినా ఉంటే చెప్ప‌మ‌ని అడ‌గ్గా…. స‌మంత గత అనుభ‌వాల‌ను పంచుకుంది. అప్ప‌ట్లో ఎంతో చ‌లాకీగా ఉండే ఓ హీరో తెగ వేధించేవాడ‌ట‌. ఆయ‌న ఎంతో అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించాడ‌ని చెప్పుకొచ్చింది. తాను చేసిన త‌ప్పు త‌న‌ని ప్రేమించ‌డ‌మే అని ఆవేద‌న వ్య‌క్తం చేసింది. ఆ హీరో ఎవ‌రో కాదు.. సిద్దార్ధ్ అని ప్ర‌చారం సాగుతోంది. గ‌తంలో సిద్దార్ధ్, ఆమె ప్రేమించుకున్న విష‌యం తెలిసిందే! పెళ్లి దాకా వ‌చ్చిన ఈ బంధం మ‌ధ్యలోనే తెగిపోయింది.

ఈ మేట‌ర్ అంతా చైతుకి తాను చెప్పాన‌ని, ఆ టైమ్‌లో చైతు ఇచ్చిన ఓదార్పే త‌న‌కు న‌చ్చింద‌ని గ‌తంలో ఓ ఇంట‌ర్‌వ్యూలో వివ‌రించింది స‌మంత‌. మొన్నామ‌ధ్య కాజ‌ల్‌… త‌న ఫ్రెండ్స్‌తో చెప్పుకున్న ఓ ఎపిసోడ్ సోష‌ల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఓ బాలీవుడ్ హీరో త‌న‌ను వాడుకొని వ‌దిలేశాడంటూ బాంబ్ పేల్చింది. తాజాగా మ‌రో టాలీవుడ్ అగ్ర క‌థానాయిక స‌మంత కూడా ఇలాంటి కామెంట్సే చేసింది. గ‌తంలో ఓ తెలుగు హీరో త‌న‌తో అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించాడ‌ని చెప్పి బాంబ్ పేల్చింది.

 

అక్కినేని వారి కోడ‌ల్నివేధించిన హీరో
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts