అల్లువారింట మరో పండగ!

July 13, 2016 at 5:14 am
allu arjun sneha

అల్లు అర్జున్ సినిమా కెరీర్ లో దూసుకుపోతున్నాడు.తాజా సరైనోడు బ్లాక్ బస్టర్ హిట్ అతని ఉత్సాహాన్ని రెట్టింపు చేసింది.ఇంకో వైపు అల్లు అర్జున్ స్నేహ దంపతులు తమ చిన్నారి బుడతడు అయాన్ రాకతో అల్లు వారింట సందడే సందడిగా ఉంది.కాగా ఇప్పుడు అల్లువారింట మరో పండుగరాబోతోందని ఫిల్మ్ నగర్ టాక్.అల్లు అర్జున్ స్నేహ దంపతులు రెండో బిడ్డకు త్వరలోనే వెల్కమ్ చెప్పనున్నారని సమాచారం.

మొన్న హరితహారం కార్యక్రమం లో పాల్గొన్న ఈ జంటను చూసిన వారందరు స్నేహ మళ్ళీ గర్భవతి అని నిర్ధారణకు వచ్చేసారు.విశ్వాసయనీయ సమాచారం ప్రకారం స్నేహ త్వరలోనే మరో పండంటి బిడ్డకి జన్మనివ్వబోతోందని తెలుస్తోంది.అంటే అల్లు వారింట మళ్ళీ పండుగ వచ్చేస్తోందన్నమాట.ఈ సారి పుట్టబోయేది మరో వారసుడో వారసురాలి తెలియాలంటే ఇంకొన్నాళ్ళు వేచి చూడాల్సిందే.

అల్లువారింట మరో పండగ!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts