ఖైదీలో ఆ డైలాగులు చూసి మేథావుల షాక్‌

January 12, 2017 at 8:53 am
Kaidhi no 150

మెగాస్టార్ చిరంజీవి దాదాపు ప‌దేళ్ల తర్వాత `ఖైదీ నెంబ‌రు 150` ద్వారా తెర‌పై క‌నిపించారు. మునుపెన్న‌డూ లేని విధంగా చిరు గ్లామ‌ర్‌గా క‌నిపిస్తుంటం అభిమానుల‌ను అల‌రిస్తోంది. త‌మిళ సినిమా క‌త్తి రీమేక్‌గా వ‌చ్చిన ఈ సినిమాలో.. త‌న పొలిటిక‌ల్ కెరీర్‌పైనా ప్ర‌భావం చూపేలా కొన్ని డైలాగులు ఉండ‌టం ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. ముఖ్యంగా సినిమాలోని డైలాగులు సాధార‌ణంగా క‌నిపిస్తున్నా.. అంత‌ర్లీనంగా వాటికి చాలా అర్థం ఉందంటున్నారు విశ్లేష‌కులు.

సినిమాల్లో మెగాస్టార్ సూప‌ర్ హిట్ అయినా… రాజ‌కీయాల్లో మాత్రం యావ‌రేజ్ అనే వారు లేక‌పోలేరు! పార్టీని పెట్టి పోటీ చేసి త‌దుప‌రి ఆ పార్టీని కాంగ్రెస్‌లో క‌లిపేసిన విష‌యం తెలిసిందే! ఆ స‌మ‌యంలో చిరుపై చాలా విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. పార్టీని న‌డిపించ‌లేకే ఇలా చేశాడ‌ని, అభిమానాన్ని కూడా తాక‌ట్టు పెట్టేశాడని తీవ్రంగా ఆగ్ర‌హం వ్య‌క్తంచేశారు. వీట‌న్నింటికీ త‌న 150వ సినిమా ద్వారా స‌మాధానం చెప్పే ప్ర‌య‌త్నంచేశాడు చిరు. ప్రతిష్టాత్మక 150వ చిత్రం ఖైదీ నెంబర్ 150లోని ఓ డైలాగ్ పెద్ద చర్చనీయాంశంగా మారింది.

ఈ సినిమాలో చిరంజీవి డైలాగు విన్న వారెవరికైనా ‘ఢిల్లీ నుండి గల్లీ పాలిటిక్స్ వ‌ర‌కు త‌ట్టుకున్న గుండెరా ఇది’ అన్న డైలాగు ఆసక్తికరంగా మారింది. ఈ డైలాగ్ చూశాక రాజకీయాల్లో సక్సెస్ కాకపోయినా..అవి చిరంజీవికి బాగానే ఒంటపట్టాయి అన్న టాక్ విన్పిస్తోంది. రాజకీయాల్లో ఘోరంగా వైఫ్యలం చెంది కూడా రాజకీయాల్లో తాను సూపర్ సక్సెస్ అన్నట్లు సినిమాలో డైలాగులు చెప్పటంతో ప్రేక్ష‌కులు అవాక్క‌వుతున్నారు.

సముద్రం ఒడ్డున నిల‌బ‌డి, స‌ముద్రం వెన‌క్కి వెళ్లింది క‌దా అని న‌వ్వితే, అదే స‌ముద్రం సునామీతో ముంచేస్తుంది..అభిమానాన్ని అమ్ముకునేంత అవినీతిప‌రుడుని కాను అనే డైలాగ్స్ అభిమానులను అయితే అలరిస్తాయి కానీ ఆలోచనాపరులను మాత్రం మ‌రింత ఆలోచించేలా చేస్తున్నాయి.

ఖైదీలో ఆ డైలాగులు చూసి మేథావుల షాక్‌
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts