గౌతమీపుత్ర శాతకర్ణి TJ రివ్యూ

January 12, 2017 at 3:36 am
Gautamiputra-Satakarni-movie-REVIEW-01

సినిమా: గౌతమి పుత్ర శాతకర్ణి
రేటింగ్: 3.75/5
పంచ్ లైన్: జయహో గౌతమీపుత్ర అంటున్న అఖండ భారతం
నటీనటులు : బాలకృష్ణ,హేమా మాలిని ,శ్రేయ,శివ రాజ్ కుమార్ తదితరులు
కథ:క్రిష్
దర్శకుడు : క్రిష్
మాటలు :బుర్రా సాయి మాధవ్
నిర్మాత : సాయి బాబు ,క్రిష్
సంగీతం : చిరంతన్ బట్
జయహో శాతకర్ణి అంటున్న తెలుగు ప్రజలు. ఈ సినిమాగురించి చెప్పాలంటే ముందుగా క్రిష్ గురించే మాట్లాడుకోవాలి. యావత్ భారత దేశాన్ని ఒక్కతాటిపైకి తెచ్చి ఏలిన మహారాజు గౌతమి పుత్ర శాతకర్ణి అని అంత గొప్ప రాజు మన తెలుగు జాతివాడని ఏవో కొద్దిపాటి ఆధారాలు పట్టుకుని మిగిలిన వాటిగురించి అన్వేషించి వెతికి పట్టుకుని ఎంతో కసితో ఈ సినిమాని చేసాడు అదికూడా కేవలం 78 రోజుల్లో. ఆ తరువాత మాట్లాడుకోవాల్సింది సినిమాకి మాటలు రాసిన బుర్రా సాయి మాధవ్ గురించి శాతకర్ణి పాత్రకోసం రాసిన డైలాగ్స్ చాల అర్ధవంతంగా ఆలోచింప చేసేలా వున్నాయి అలాగే శాతకర్ణి తల్లి పాత్రతో పలికించిన మాటలు కూడా చాల అద్భుతం గ వున్నాయి.

ఇక ఈ సినిమా నటసింహం బాలకృష్ణ కెరీర్ లో 100 వ సినిమా కావటం నిజంగా బాలయ్య తన నట విశ్వరూపం చూపించడానికి దొరికిన మంచి అవకాశంగా అనిపించింది ఈ గౌతమీపుత్ర శాతకర్ణి. శాతకర్ణి పాత్రలో బాలకృష్ణని తప్ప ఇంకెవరిని వూహించలేమనేంతగా ఆ పాత్రలో జీవించాడు బాలయ్య. యుద్ధసన్నివేశలలో కానీ డైలాగ్స్ చెప్పటం లో కానీ బాలయ్యకి ఇంకెవరు సాటిరారని మరోసారి నిరూపించాడు. శాతకర్ణి తల్లి గౌతమి పాత్రలో హేమమాలిని పర్ఫెక్ట్ అనిపించారు. శాతకర్ణి భార్య వశిష్ట దేవి పాత్రలో శ్రేయ ఒదిగిపోయింది. మిగిలిన సామంతరాజులు పాత్రలు కూడా చాల బాగా కుదిరాయి.

సినిమాలో వున్న యుద్ధ సన్నివేశాలన్నీ దేనికవే అన్నట్టుగా విజువల్ గా అద్భుతంగా చూపించాడు క్రిష్. ఇంకా సిరివెన్నెల సీతారామ శాస్త్రిగారు రాసిన పాటలు సందర్భోచితంగా సినిమాని మరోమెట్టు పైకెక్కేట్టు చేశాయి. ఆర్ట్ డైరెక్టర్ భూపేష్ వేసిన సెట్స్ అన్ని అద్భుతంగా వున్నాయి. సినిమా కోసం పనిచేసిన టెక్నికల్ డిపార్ట్మెంట్స్ అన్ని ఒకరితో మరొకరు పోటీ పడి పనిచేసినట్టుగా వుంది.

ఫైనల్ గా ఈ సినిమా మనకు తెలియని మనం తెలుసుకోవాల్సిన మన తెలుగు జాతి వాడైన గౌతమీపుత్ర శాతకర్ణి విరోచితం గా పోరాడి అఖండ భారత దేశాన్ని ఒక్క తాటిపైకి తెచ్చి భారత దేశ పౌరుషాన్ని దశ దిశలా వ్యాపించేసిన చరిత్ర.

గౌతమీపుత్ర శాతకర్ణి TJ రివ్యూ
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts