గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణికి సీక్వెల్ వస్తోందా?

January 10, 2017 at 5:24 am
GPSK

ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ కేరీర్‌లో ప్ర‌తిష్టాత్మ‌క‌మైన 100వ సినిమాగా తెర‌కెక్కిన గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి సినిమా ఈ నెల 12న వ‌ర‌ల్డ్‌వైడ్‌గా గ్రాండ్‌గా రిలీజ్ అవుతోంది. ఆంధ్ర‌దేశాన్ని పాలించిన శాత‌వాహ‌న యువ‌రాజు శాత‌క‌ర్ణి జీవిత చ‌రిత్ర ఆధారంగా తెర‌కెక్కుతోన్న ఈ సినిమాపై భారీ హైప్ ఉంది. ఈ సినిమాను ద‌ర్శ‌కుడు క్రిష్ ఓ య‌జ్ఞంలా భావించి రూ.55 కోట్ల బ‌డ్జెట్‌తో కేవ‌లం 8 నెల‌ల్లో తెర‌కెక్కించాడు.

ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో బిజీగా వున్న క్రిష్ మరో ఆసక్తికరమైన వార్తను ప్రకటించారు. గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి సినిమాకు సీక్వెల్ కూడా తెర‌కెక్కించే ఆలోచ‌న ఉంద‌ని ప్ర‌క‌టించాడు. ఈ సినిమాకు సంబంధించిన స్టోరీని కూడా క్రిష్ వెల్ల‌డించాడు.

శాత‌క‌ర్ణి సినిమాలో గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి జీవిత చ‌రిత్ర ఉంటే…. శాతకర్ణి తనయుడు వశిష్టిపుత్ర పులిమావి రాజ్యపాలన నేపథ్యంలో ఆ సీక్వెల్ తెరకెక్కుతుందని చెప్పారు. అంతకు మించి ఆ సీక్వెల్ కు సంబంధించిన వివరాలను ఆయన వెల్లడించలేదు.

క్రిష్ శాత‌క‌ర్ణికి సీక్వెల్ ఉంటుంద‌ని ప్ర‌క‌టించిన నేప‌థ్యంలో శాత‌క‌ర్ణి హిట్‌పై ఉన్న కాన్ఫిడెంట్‌తోనే ఆయ‌న ఈ ప్ర‌క‌ట‌న చేసి ఉంటార‌న్న చ‌ర్చ జ‌రుగుతోంది. మ‌రి శాత‌క‌ర్ణి అంచ‌నాలు ఏ మేర‌కు అందుకుంటుందో చూడాలి.

 

గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణికి సీక్వెల్ వస్తోందా?
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts