చరణ్ సినిమా కోసం బెట్టు చేస్తున్న అనుపమ

త్రివిక్రమ్ ‘అ..ఆ’ మూవీతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన అనుపమ ఆ సినిమా లో నెగిటివ్ టచ్ వున్నా క్యారెక్టర్ చేసికుడా తన అందం తో తెలుగు ప్రేక్షకులనిఆకట్టుకుంది. ఆ తరువాత నాగచైతన్య ప్రేమమ్ సినిమాలో ఒక హీరోయిన్గా చేసి హిట్ కొట్టింది. ఇంకా ఇప్పుడు సంక్రాంతికి రిలీజ్ అయిన ‘శతమానం భవతి’తో హ్యాట్రిక్ హిట్ కొట్టింది ఈ మలయాళీ కుట్టి.

వరుస హిట్స్ రావడంతో  ఇప్పుడు ఈ భామాధి టాలీవుడ్ లో గోల్డెన్ లెగ్ అయిపోయింది. హ్యాట్రిక్ హిట్స్ ఇవ్వడంతో  పాటు తన క్యూట్ లుక్స్, పెర్ఫార్మెన్స్‌తో డైరెక్టర్ సుకుమార్ చరణ్ తో చేస్తున్న సినిమాలో హీరోయిన్ గా అవకాశం కొట్టేసింది. ఈ ఛాన్స్ రావటంతో అనుపమ వేసిన ప్లాన్ గురించి టాలీవుడ్ లో చర్చ జరుగుతది.

చెర్రీతో చేసే ఈ సినిమా హిట్ అయితే టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ అవటం కాయం అని ఈ అమ్మడు ఇప్పుడు వేరే చిన్న సినిమాలలో అవకాశం వచ్చినా చేయనని బెట్టు చేస్తోందట. కేవలం బిగ్ బడ్జెక్ట్ సినిమాలే చేస్తానంటుందట. అందుకే ప్రస్తుతానికి ఇంకా కొత్త సినిమాలేవీ ఒప్పుకోలేదట ఈ కేరళ కుట్టి.