చిరు కోసం నాలుగు స్తంభాలాట‌

January 7, 2017 at 6:01 am
chiranjeevi

ప‌దేళ్ల త‌ర్వాత ఖైదీ నెంబ‌ర్ 150 సినిమాతో టాలీవుడ్‌లోకి కం బ్యాక్ అవుతోన్న మెగాస్టార్ కోసం అట అభిమానుల‌తో పాటు ఇటు టాలీవుడ్ సినీజ‌నాలు కూడా ఎంతో ఆస‌క్తితో వెయిట్ చేస్తున్నారు. ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో ఎక్క‌డ చూసినా ఖైదీ, శాత‌క‌ర్ణి ఫీవ‌రే క‌నిపిస్తోంది. ఇదిలా ఉంటే చిరు 151వ సినిమాపై అప్పుడే డిస్క‌ర్ష‌న్ స్టార్ట్ అయ్యింది. ఈ స‌మ్మ‌ర్‌కు ముందుగానే చిరు కొత్త సినిమా ప‌ట్టాలెక్క‌నుంది.

ఈ క్ర‌మంలోనే చిరు 151వ సినిమా కోసం బోయ‌పాటి శ్రీను – క్రిష్ పేర్లు వినిపిస్తున్నాయి. శాత‌క‌ర్ణి హిట్ అయితే చిరు బోయ‌పాటి కంటే క్రిష్‌తోనే మొగ్గు చూపే అవ‌కాశాలు ఎక్కువుగా క‌నిపిస్తున్నాయి. చిరు 151వ సినిమాను నిర్మించేందుకు ఇప్పుడు ప‌లు నిర్మాణ సంస్థ‌లు పోటీప‌డుతున్నాయి.

ముందుగా చిరు 151వ సినిమాను అల్లు అర‌వింద్ నిర్మిస్తాన‌ని చెప్పాడు. ఇక ఇటీవ‌ల చిరు త‌న‌యుడు చెర్రీ డాడీ 151వ సినిమాను సైతం తానే నిర్మిస్తాన‌ని చెప్పారు. ఇక క్రిష్ డైరెక్ష‌న్‌లో న‌టించేందుకు చిరు ఓకే చెపితే క్రిష్‌కు సొంత బ్యాన‌ర్ ఉంది. శాత‌క‌ర్ణి సినిమాలా ఆయ‌నే కావాల‌నుకుంటే ఈ సినిమాను సొంతంగా నిర్మించ‌వ‌చ్చు.

ఇక క్రిష్ వైజ‌యంతీ మూవీస్ అధినేత అశ్వ‌నీద‌త్‌కు ఓ సినిమా క‌మిట్ అయ్యాడు. ఈ క్ర‌మంలోనే చిరు 151వ సినిమా కోసం ఆయ‌న క‌ర్చీఫ్ వేసే అవ‌కాశాలు పుష్క‌లంగా క‌నిపిస్తున్నాయి. అశ్వ‌నీద‌త్‌కు గ‌తంలో ఇచ్చిన క‌మిట్‌మెంట్ దృష్ట్యా క్రిష్ ఈ ప్రాజెక్టును ఓకే చేయ‌వ‌చ్చు. ఏదేమైనా చిరు 151వ సినిమాను నిర్మించేందుకు నలుగురు నిర్మాత‌లు పోటీప‌డుతున్నారు. ఫైన‌ల్‌గా వీరిలో ఎవ‌రు చిరుతో సినిమా చేసే ఛాన్స్ కొట్టేస్తారో చూడాలి.

 

చిరు కోసం నాలుగు స్తంభాలాట‌
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts