చిరు ఖైదీ మొత్తం సెంటిమెంట్ల మ‌య‌మే

January 6, 2017 at 7:41 am
chiru

సినిమా వాళ్లు సెంటిమెంట్ల‌ను ఎలా న‌మ్ముతారో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఈ సెంటిమెంట్లు మంచివి ఉంటాయి, చెడ్డ‌వి ఉంటాయి. ఈ క్ర‌మంలోనే మెగాస్టార్ చిరంజీవి కం బ్యాక్ మూవీ ఖైదీ నెంబ‌ర్ 150 విష‌యంలో కూడా చిరు చాలా సెంటిమెంట్లు ఫాలో అవుతున్నారు. ఈ సినిమా విష‌యానికి వ‌స్తే చిరు గ‌తంలో త‌న‌కు ఠాగూర్ లాంటి హిట్ సినిమా ఇచ్చిన ద‌ర్శ‌కుడు వినాయ‌క్‌నే ఎంచుకున్నారు.

ఠాగూర్ కోలీవుడ్‌లో హిట్ అయిన ర‌మ‌ణ‌కు రీమేక్‌. ఇప్పుడు ఖైదీ అక్క‌డ క‌త్తి హిట్ సినిమాకు రీమేక్‌. ఈ రెండు సినిమాల‌కు అక్క‌డ మురుగ‌దాసే ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఠాగూర్ సినిమాలో హీరోయిన్‌‌గా నటించిన శ్రియను కూడా చిరు 150వ సినిమాలో చిన్నపాత్రలో నటించింద‌ట‌. ఈ విష‌యాన్ని చిత్ర యూనిట్ స‌స్పెన్స్‌గా ఉంచిన‌ట్టు తెలుస్తోంది.

ఇక ఈ సినిమాను నిర్మిస్తున్న రాంచరణ్ కూడా తన తండ్రి కమ్ బ్యాక్ మూవీలో ఓ సాంగ్‌లో తండ్రితో క‌లిసి స్టెప్పులు వేస్తాడ‌ట‌. ఇక ఠాగూర్ సినిమాలో ఆ సినిమా డైరెక్ట‌ర్ వినాయ‌క్ ఓ సీన్‌లో త‌ళుక్కున మెరుస్తాడు. అప్పుడు ఈ సీన్‌ను చిరు డైరెక్ట్ చేశాడు. ఇప్పుడు ఖైదీ 150లో సైతం వినాయ‌క్ ఓ సీన్‌లో త‌ళుక్కున మెరిశాడు. ఈ సీన్‌ను సైతం చిరుయే డైరెక్ట్ చేశాడు. ఈ సెంటిమెంట్ల‌ను చిరు కావాల‌నే రిపీట్ చేయించార‌ట‌. మ‌రి ఈ సెంటిమెంట్లు ఖైదీకి ఎంత వ‌ర‌కు క‌లిసి వ‌స్తాయో చూడాలి.

 

చిరు ఖైదీ మొత్తం సెంటిమెంట్ల మ‌య‌మే
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts