చిరు మూవీకి పొలిటిక‌ల్ క‌ల‌ర్స్‌!

January 2, 2017 at 12:49 pm
Chiru

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మ‌కంగా భావిస్తున్న 150 వ మూవీ ఖైదీ నంబ‌ర్ 150కి ఇప్పుడు ఏపీలో రాజ‌కీయ క‌ల‌ర్స్ ముసురుకున్నాయి! ఈ మూవీ ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్ నిర్వ‌హించాల‌ని మూవీ యూనిట్ స‌న్నాహాలు చేస్తోంది. అయితే, దీనిని తొలుత ఏపీ రాజ‌ధాని ప్రాంతం విజ‌య‌వాడ‌లోని ఇందిరాగాంధీ స్టేడియంను ఎంచుకున్నారు. కానీ, ప్ర‌భుత్వం ఈ ఫంక్ష‌న్‌కి అనుమ‌తి ఇచ్చేందుకు నిరాక‌రించిన‌ట్టు స‌మాచారం. దీంతో చిరు అభిమానులు ఒకింత హ‌ర్ట్ అయ్యారు. విష‌యంలోకి వెళ్తే.. చిరు 150వ మూవీ ఆడియో ఇప్ప‌టికే మార్కెట్‌లోకి విడుద‌లైంది.

అయితే, ప్రీ రిలీజ్‌ని మాత్రం ఘనంగా ఈ నెల 4న‌ విడుద‌ల చేద్దామ‌ని చిత్రానికి నిర్మాత‌గా ఉన్న చిరు త‌న‌యుడు చెర్రీ భావించాడు. దీంతో అన్ని ఏర్పాట్లూ చేయాల‌ని అభిమానుల‌ను కోర‌డంతో వారంతా ఆ ప‌నిలో బిజీ అయిపోయారు. అయితే, ఇప్పుడు ప్ర‌భుత్వం మాత్రం మూవీల‌పై రాజ‌కీయాలు చేస్తోంద‌నే టాక్ వినిపిస్తోంది. చిరు కాంగ్రెస్ ఎంపీ కావ‌డం, రాష్ట్రంలో టీడీపీ ప్ర‌భుత్వం అధికారంలో ఉండ‌డంతో ఉద్దేశ పూర్వ‌కంగానే మూవీ ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్‌కి అధికారులు వివిధ కార‌ణాలు చూపుతూ అనుమ‌తిని నిరాక‌రిస్తున్న‌ట్టు తెలుస్తోంది.

కానీ, విశేషం ఏంటంటే.. టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న బాల‌య్య మూవీ ఫంక్ష‌న్ల‌కు మాత్రం అధికారులు ఎలాంటి ఆటంకాలూ చూప‌కుండా అనుమ‌తులు మంజూరు చేయ‌డం! మ‌రోప‌క్క‌, చిరు అభిమానులు ప్రీ రిలీజ్‌ ఫంక్షన్ ను జనవరి 7న గుంటూరులో నిర్వ‌హిస్తార‌నే ప్రచారం జరుగుతోంది. దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

చిరంజీవి నటిస్తోన్న 150వ చిత్రం ‘ఖైదీ నంబర్‌ 150’. కాజల్‌ అగార్వాల్‌ హీరోయిన్‌గా వీవీ వినాయక్‌ దర్శకత్వలో రూపుద్దిద్దుకున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 11న విడుదల కానుంది. మ‌రి అప్ప‌టికి ఇంకెన్ని చిక్కులు ఎదుర‌వుతాయో చూడాలి!!

 

చిరు మూవీకి పొలిటిక‌ల్ క‌ల‌ర్స్‌!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts