చిరు 151వ సినిమా టైటిల్ క‌న్‌ఫార్మ్‌..?

January 10, 2017 at 8:03 am
chiru

మెగాస్టార్ చిరంజీవి కం బ్యాక్ మూవీ ఖైదీ నెంబ‌ర్ 150 సినిమా లెక్క‌కు మిక్కిలిగా ఉన్న అంచ‌నాల మ‌ధ్య రేపు థియేట‌ర్ల‌లోకి వ‌స్తోంది. ఇప్పుడు అంద‌రూ బాస్ ప‌దేళ్ల త‌ర్వాత ఆన్ స్క్రీన్ మీద చేసే ర‌చ్చ కోసం వెయిట్ చేస్తున్నారు. చిరు 150వ సినిమా త‌ర్వాత చేసే 151వ సినిమా గురించి అప్పుడే డిస్క‌ర్ష‌న్ స్టార్ట్ అయిపోయింది.

చిరు 150 షూటింగ్ ద‌శ‌లో ఉండ‌గానే ఆయ‌న 151వ సినిమా కోసం ప‌లువురు ద‌ర్శ‌కులు, ఒక‌టి రెండు క‌థ‌లు కూడా లైన్లో ఉన్న‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి. ఇక చిరు 151వ సినిమా డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీను అని త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ అని సురేంద‌ర్‌రెడ్డి అని ర‌క‌ర‌కాలుగా గాసిప్స్ ప్ర‌చార‌మ‌య్యాయి.

వీటిపై చిరు క్లారిటీ ఇచ్చేశారు. త‌న 151వ సినిమాపై వ‌స్తోన్న వార్త‌ల్లో నిజం లేద‌ని ఆయ‌న కొట్టిప‌డేశారు. త‌న 151వ సినిమా వార్త‌ల‌పై మెగాస్టారే సమాధానం చెప్పేశారు. త‌న 150వ సినిమా కోసం ముందుగా ఉయ్యాలవాడ న‌ర‌సింహారెడ్డి క‌థ‌ను విన్నాన‌ని, అయితే ఇప్పుడు అదే క‌థ‌తో త‌న 151వ సినిమా చేస్తే బాగుంటుంద‌ని అనుకుంటున్న‌ట్టు చిరు చెప్పాడు.

అలాగే సురేంద‌ర్‌రెడ్డి చెప్పిన మ‌రో క‌థ సైతం తాను విన్నాన‌ని..అది కూడా బాగుంద‌ని చిరు చెప్పాడు. ఏదేమైనా ఇండ‌స్ట్రీలో విన‌ప‌డుతోన్న ఇన్న‌ర్ టాక్ ప్ర‌కారం చిరు 151వ సినిమాగా ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి సినిమాయే ఉంటుంద‌ని స‌మాచారం. ఈ సినిమాకు దర్శ‌కుడు ఎవ‌ర‌న్న‌ది మాత్రం క‌న్‌ఫార్మ్ కావాల్సి ఉంది. ఇక ఈ సినిమాకు క‌థ‌కు త‌గ్గ‌ట్టే ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి అని ఖ‌రారు చేసే ఛాన్సులే ఎక్కువుగా ఉన్నాయి.

 

చిరు 151వ సినిమా టైటిల్ క‌న్‌ఫార్మ్‌..?
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts