టాలీవుడ్ కు షాక్ ఇస్తోన్న మంచు ఫ్యామిలీ

January 21, 2017 at 6:00 am
1211

టాలీవుడ్‌లో క్ర‌మ‌శిక్ష‌ణ‌కు మారుపేరు అయిన మంచు ఫ్యామిలీలో ఇప్పుడు వార్ జ‌రుగుతోంది. మోహ‌న్‌బాబు ముగ్గురు పిల్ల‌లు అయిన విష్ణు – మ‌నోజ్ – ల‌క్ష్మి మ‌ధ్య బిగ్ ఫైట్ జ‌రుగుతోంది. అయితే ఇది రియ‌ల్ ఫైట్ కాదు సుమా..రీల్ ఫైట్‌. మ‌రి ఆ బిగ్ ఫైట్ మ్యాట‌ర్ ఏంటో చూద్దాం.

టాలీవుడ్‌లో క‌లెక్ష‌న్ కింగ్ మంచు ఫ్యామిలీకి కొద్ది రోజులుగా కాలం క‌లిసి రావ‌డం లేదు. గ‌త రెండేళ్ల‌లో విష్ణు సినిమా ఈడోర‌కం – ఆడోర‌కం మిన‌హాయిస్తే అన్ని సినిమాలు ప్లాపులే అయ్యాయి. మ‌నోజ్ గ‌తేడాది చేసిన ఎటాక్  – శౌర్య రెండూ పెద్ద డిజాస్ట‌ర్లు అయ్యాయి. విష్ణు కూడా ఎర్ర‌బ‌స్సు -డైన‌మైట్ లాంటి డిజాస్ట‌ర్ల‌ను ఎదుర్కొన్నాడు. మంచు ల‌క్ష్మి దొంగాట యావ‌రేజ్ అయితే బ‌డుగు ప్లాప్ అయ్యింది. దీంతో  ఈ ముగ్గురూ 2017లో టాలీవుడ్‌లో ఒకేసారి వ‌రుస‌గా దండ‌యాత్ర స్టార్ట్ చేస్తున్నారు. వీరి ముగ్గురు సినిమాలు ఫిబ్ర‌వ‌రిలోనే ప్రేక్ష‌కుల ముందుకు రానున్నాయి.

ఈ క్ర‌మంలోనే ముందుగా మంచు విష్ణు ల‌క్కున్నోడు సినిమా ఫిబ్ర‌వ‌రి 3న ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తోంది. రాజ్ కిర‌ణ్ డైరెక్ష‌న్‌లో ఈ సినిమా తెర‌కెక్కింది. ఈ సినిమా వ‌చ్చిన వారానికే త‌మ్ముడు మ‌నోజ్ థియేట‌ర్ల‌లోకి వ‌స్తున్నాడు. మ‌నోజ్ కొత్త సినిమా గుంటూరోడు ఫిబ్ర‌వ‌రి 10న రిలీజ్ అవుతోంది. ఎస్కే.స‌త్య ఈ సినిమాను తెర‌కెక్కించాడు.

ఇక వీరితో పాటు వీరి సోద‌రి మంచు ల‌క్ష్మి సైతం త‌న ల‌క్ష్మీ బాంబు సినిమాతో ఈ నెల‌లోనే వ‌స్తోంది. ఆమె న‌టించిన ఈ సినిమా డిసెంబ‌ర్‌లోనే రిలీజ్ కావాల్సి ఉన్నా నోట్ల ర‌ద్దు ఎఫెక్ట్‌తో ఈ సినిమా వాయిదా ప‌డుతూ వ‌స్తోంది. ఈ సినిమాను సైతం ఫిబ్ర‌వ‌రి 3న లేదా 17న రిలీజ్  చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. మ‌రి మంచు ఫ్యామిలీకి ఫిబ్రవరి ఎలాంటి ఫలితాన్నిస్తుందో చూడాలి. ఈ ఫైటింగ్‌లో ఎవ‌రు పైచేయి సాధిస్తారో కూడా చూడాలి.

టాలీవుడ్ కు షాక్ ఇస్తోన్న మంచు ఫ్యామిలీ
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts