దుమ్ము లేపుతోన్న ఖైదీ ఓవ‌ర్సీస్ క‌లెక్ష‌న్స్‌

January 11, 2017 at 7:14 am
Khaidi 150

మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నెంబ‌ర్ 150 – బాస్ ఈజ్ బ్యాక్ అంటూ ఈ రోజు థియేట‌ర్ల‌లో వాలిపోయాడు. చిరు తొమ్మిది సంవ‌త్స‌రాల త‌ర్వాత వెండితెర మీద క‌నిపిస్తుండ‌డంతో ఈ సినిమాకు భారీ హైప్ వ‌చ్చింది. అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్టుగానే సినిమా ఉండ‌డంతో తొలి రోజు వ‌సూళ్ల ప‌రంగా దుమ్ము రేపుతున్నాడు మెగాస్టార్‌.

తొలి రోజు సోలోగా రావ‌డం ఖైదీకి బాగా క‌లిసొచ్చింది. ఈ క్ర‌మంలోనే ఖైదీ బుధ‌వారం ప్ర‌పంచ‌వ్యాప్తంగా 4500 థియేట‌ర్ల‌లో రిలీజ్ అయిన‌ట్టు ట్రేడ్ వ‌ర్గాలు చెపుతున్నాయి. ఇక మంగ‌ళ‌వారం అర్ధ‌రాత్రి నుంచే భారీ ఎత్తున ప్రీమియ‌ర్ షోలు వేశారు. ఓవ‌ర్సీస్‌లో అయితే ఒక రోజు ముందుగానే ప్రీమియ‌ర్లు ప‌డ్డాయి.

చిరు చాలా రోజుల త‌ర్వాత చేస్తోన్న సినిమా కావడంతో ఓవ‌ర్సీస్‌లో ఏకంగా 136 చోట్ల ప్రీమియ‌ర్లు వేశారు. ఈ ప్రీమియ‌ర్ల‌తోనే ఖైదీ అంద‌రికి షాక్ ఇస్తూ 1 మిలియ‌న్ డాల‌ర్ల‌ను రాబ‌ట్టేసింది. పూర్తి క‌లెక్ష‌న్ల వివ‌రాలు వ‌చ్చే స‌రికి ఖైదీ బాహుబ‌లి ప్రీమియ‌ర్ల రికార్డు అయిన 1.3 మిలియ‌న్ డాల‌ర్ల మార్క్‌ను సైతం ఖైదీ దాటేస్తుంద‌ని అంచ‌నా వేస్తున్నారు.

ఏదేమైనా చిరు తొమ్మిది సంవ‌త్స‌రాల పాటు వెండితెర‌కు దూరంగా ఉన్నా చిరు క్రేజ్ ఏ మాత్రం త‌గ్గ‌లేద‌ని సినిమాకు పోటెత్తుతోన్న మెగా అభిమానులు, క‌లెక్ష‌న్ల లెక్క‌లే చెపుతున్నాయి. ఓవ‌రాల్‌గా ఫ‌స్ట్ డే వ‌సూళ్ల‌లో సైతం ఖైదీ బాహుబ‌లిని క్రాస్ చేస్తుంద‌ని లెక్క‌లు వేసుకుంటున్నారు.

 

దుమ్ము లేపుతోన్న ఖైదీ ఓవ‌ర్సీస్ క‌లెక్ష‌న్స్‌
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts