పవన్ కళ్యాణ్ అతన్ని దూరంపెట్టాడు

pawan-kalyan-trivikram

ప్రస్తుతం టాలీవుడ్ అగ్ర దర్శకుల్లో ఒకడిగా వున్న త్రివిక్రమ్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ల స్నేహం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వాళ్లిద్దరూ కలసి చేసింది రెండే సినిమాలయినా వారిరువురి అభిప్రాయాలు, ఆలోచనల్లోని సారూప్యం ఇద్దరినీ మరింత దగ్గర చేసి గొప్ప స్నేహితులుగా మార్చింది.

అయితే ఇప్పుడు ఆ ఇద్దరి స్నేహితుల స్నేహం గురించి టాలీవుడ్ లో రకరకాలుగా వార్తలు వినిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ సర్ధార్ గబ్బర్ సింగ్ పరాజయం తరువాత త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ కంబినేషన్లో సినిమా వస్తుందని అందరూ భావించారు. అయితే పవన్ మాత్రం తరవాత సినిమాని కాటమరాయుడు ని వేరే డైరెక్టర్ చేతిలో పెట్టాడు .

అయితే కాటమరాయుడు సినిమా అవగానే త్రివిక్రమ్ సినిమా ఉంటుందని దానికి కథ కూడా పవన్ దేనని, దానిపైనే త్రివిక్రమ్ వర్కుచేస్తున్నాడని భావించారు. అయితే దానికికూడా చెక్ పెడుతూ తమిళంలో వేళాయుధం, జిల్లా వంటి చిత్రాలకు పనిచేసిన ఆర్‌టీ నిశాన్‌కు కాటమరాయుడు తరువాత సినిమా బాధ్యతలు అప్పగించాడు పవన్. దీంతో పవన్ కళ్యాణ్ కి త్రివిక్రమ్ కి చెడిందని అందుకే పవన్ త్రివిక్రమ్ ని దూరం పెడుతున్నాడని ఫిలింనగర్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. దీంతో త్రివిక్రమ్ కూడా పవన్ కోసం ఇంకా ఎదురు చూడలేక మహేష్ వెంట పడుతున్నాడని టాక్.

పవన్ కళ్యాణ్ అతన్ని దూరంపెట్టాడు
0 votes, 0.00 avg. rating (0% score)

Related Posts