ప్రభాకర్ కి పాలాభిషేకమా?

August 25, 2016 at 5:55 am
chinthamaneni prabhakar denduluru

ఇది విన్నారా..బ్రతికున్న వ్యక్తికి పాలాభిషేకం ఎక్కడైనా చూసారా..అయితే ఇదిగో టీడీపీ ప్రభుత్వ విప్ ,పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు శాసన సభ్యుడు చింతమనేని ప్రభాకర్ గారికి పాలాభిషేకం జరిగిందహో..ఆయనేమైనా వీరాజావానా.స్వతంత్ర సమరయోధుడా..లేక జాతి యావత్తుని సన్మార్గంలో నడిపిన యుగపుషుడా లేక సమాజసేవకై పుట్టిన మదర్ థెరిస్సానా అని అడక్కండి.

చింతమనేనికి ఉన్న క్వాలిఫికేషన్ ఏంటి అనా మీ అనుమానం..అదేనండి..మహిళా MRO వనజాక్షిణ ఇసుక మాఫియా చేస్తూ ఈడ్చి పడేయడం..అడ్డొచ్చిన పొలిసు అధికారుల్ని భౌతికంగా దాడులు చేయించడం.ప్రభుత్వ అధికారిని బెదిరించి భయాందోళనలకు గురిచేయడం..పాపం కానిస్టేబుల్ ని కుళ్ళబొటవడం..ప్రశ్నిస్తే బెదిరించడం లేదంటే దాడులు చేయడం..ఇవన్నీ ప్రభాకర్ గారి అదనపు అర్హతలు పాలాభిషేకానికి.

పోలవరం కుడి కాల్వ ద్వారా దెందులూరు నియోజక పరిధిలో 330 ఎకరాలకు పట్టిసీమ నీరందినందుకు కృతజ్ఞతగా రైతులే ఈ పాలాభిషేకాన్ని నిర్వహించారట.ఇంకా నయం ప్రభుత్వాధికారులు కూడా అభిషేకం చేశారు అనలేదు.అయినా ప్రభుత్వ విప్ గా ఉంటూ ప్రభాకర్ గారు ఈ వింత పోకడలు..విపరీత చేష్టలతో అధికార దుర్వినియోగం చేయడం దేనికి సంకేతం..

ప్రభాకర్ కి పాలాభిషేకమా?
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts