ప‌వ‌న్‌ను బుజ్జ‌గించే ప‌నిలో వ‌దిన‌మ్మ‌

January 5, 2017 at 7:00 am
pawan

మెగా ఫ్యామిలీలో మెగా బ్ర‌ద‌ర్స్ మ‌ధ్య ఉన్న విబేధాలు చిరు కం బ్యాక్ మూవీ ఖైదీ నెంబ‌ర్ 150 సాక్షిగా మ‌రోసారి బ‌హిర్గ‌తం అయ్యేలా ఉన్నాయి. చిరు 150వ సినిమా కావ‌డంతో ఈ సినిమా ఆడియో ప్రి రిలీజ్ ఫంక్ష‌న్‌కు మెగా హీరోలంద‌రూ వ‌స్తున్నారు. ఇక ఈ ఫంక్ష‌న్ ఎనౌన్స్ అయిన‌ప్ప‌టి నుంచి ప‌వ‌న్ సైతం వ‌స్తాడ‌ని అంద‌రూ అనుకున్నారు. తాజాగా అల్లు అర‌వింద్ ప‌వ‌న్ ఈ ఫంక్ష‌న్‌కు రావ‌డం లేద‌ని బాంబు పేల్చారు.

ప‌వ‌న్ బిజీ షెడ్యూల్ వ‌ల్లే ఈ కార్య‌క్ర‌మానికి రావ‌డం లేద‌ని అర‌వింద్ చెప్ప‌డంతో మెగా అభిమానులంద‌రూ షాక్ అయ్యారు. ఇక చెర్రీ రీసెంట్‌గా నిర్వ‌హించిన ఫేస్‌బుక్ లైవ్ ప్రోగ్రామ్‌లో సైతం తాను బాబాయ్‌ను ఇన్వైట్ చేస్తున్నాన‌ని… రావడం రాకపోవడం ఆయనిష్టమని తేల్చేశాడు. అంత‌టితో ఆగ‌కుండా బాబాయ్ ఏం చిన్న‌పిల్లాడు కాదు క‌దా అన‌డంతో కూడా మెగా ఫ్యామిలీకి ప‌వ‌న్‌కు మ‌ధ్య ఉన్న గ్యాప్ మ‌రింత తేట‌తెల్ల‌మైంది.

ఇదిలా ఉంటే చిరు వ‌ర్సెస్ ప‌వ‌న్ ఉన్న గ్యాప్‌ను పూడ్చేందుకు, ప‌వ‌న్‌ను ఈ ఫంక్ష‌న్‌కు ర‌ప్పించే బాధ్య‌త‌ను చిరు భార్య సురేఖ రంగంలోకి దిగుతున్న‌ట్టు తెలుస్తోంది. గ‌తంలో ప‌వ‌న్ చాలాసార్లు సురేఖ త‌న‌కు త‌ల్లిలాంటిద‌ని చెప్పాడు. ఈ క్ర‌మంలోనే పవన్ కోసం చిరు భార్య సురేఖ స్వయంగా ప‌వ‌న్ ఇంటికి వెళ్లి ఆహ్వానించనున్నట్లు తెలుస్తోంది.

సురేఖ త‌న‌కు త‌ల్లి లాంటిది అని చెప్పిన ప‌వ‌న్…ఆమె పిలిస్తే ఈ ఫంక్ష‌న్‌కు త‌ప్ప‌కుండా వ‌స్తాడ‌ని మెగా క్యాంప్ ధీమాగా ఉంది. ఏదేమైనా స‌ప్త‌గిరి ఎక్స్‌ప్రెస్ లాంటి చిన్న సినిమా ఆడియో ఫంక్ష‌న్‌కు సైతం వెళ్లిన ప‌వ‌న్ ఇప్పుడు త‌న అన్న 150వ సినిమా ఫంక్ష‌న్‌కు డుమ్మా కొట్ట‌డం వెన‌క వీరిద్ద‌రి మ‌ధ్య గ్యాప్ మ‌రోసారి తేట‌తెల్ల‌మైంది.

 

ప‌వ‌న్‌ను బుజ్జ‌గించే ప‌నిలో వ‌దిన‌మ్మ‌
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts