బాల‌య్య‌కు కేసీఆర్ భ‌లే ప‌రీక్ష పెట్టారే..!

January 6, 2017 at 12:56 pm
KCR

ప్ర‌తిష్టాత్మ‌క క‌థ‌తో బాల‌య్య న‌టించిన 100వ మూవీ శాత‌క‌ర్ణి విడుద‌ల‌కు రెడీ అయింది. అయితే, దీనిని ముందుగా తెలంగాణ సీఎం కేసీఆర్‌కి ప్ర‌త్యేకంగా చూపించాల‌ని బాల‌య్య తెగ సంబ‌ర ప‌డుతున్నారు. వాస్త‌వానికి ఈ మూవీ స్టార్టింగ్ డే ఫంక్ష‌న్‌లో పాల్గొన్న కేసీఆర్‌.. మూవీని ప్ర‌త్యేకంగా ప్ర‌ద‌ర్శిస్తే.. త‌ప్ప‌కుండా వ‌స్తాన‌ని చెప్పారు.

ఈ నేప‌థ్యంలో బాల‌య్య కేసీఆర్‌కి ప్ర‌త్యేకంగా ఈ మూవీని చూపించాల‌ని డిసైడ్ అయ్యారు. ఈ నేపథ్యంలో..కేసీఆర్ ను ప్రత్యేకంగా ఆహ్వానించేందుకు తెలంగాణ అసెంబ్లీకి వెళ్లిన బాలకృష్ణకు.. ఆయన అప్పటివరకూ ఉండి ఇంటికి వెళ్లినట్లుగా తెలవడంతో ప్రగతి భవన్ కు చేరుకొని ఇన్విటేషన్ ఇచ్చారు.

ఈ సందర్భంగా తన చిత్రం స్పషల్ షోకు రావాలని కేసీఆర్ ను బాలకృష్ణ ఆహ్వానించిన సందర్భంగా ఆసక్తికర సంబాషణ జరిగినట్లుగా చెబుతున్నారు. వాస్త‌వానికి ఈ మూవీ స్టార్టింగ్ డే నాడు.. ప్ర‌త్యేకంగా ప్ర‌ద‌ర్శించే మూవీకి త‌న‌తో పాటు ప్ర‌ముఖులైన చిరంజీవి.. నాగార్జున.. వెంకటేశ్.. రాఘవేంద్రరావు.. దాసరి తదితరులంతా వస్తే బాగుంటుందని.. కేసీఆర్ అన్నారు. ఇప్పుడు కూడా కేసీఆర్ నాటి మాట‌నే మ‌రోసారి గుర్తు చేసి… ఇదే వ్యాఖ్యానించిన‌ట్టు స‌మాచారం.

అయితే, వాస్త‌వానికి చిరు కూడా త‌న 150వ మూవీ ప్రీ రిలీజ్ కోసం తీవ్ర స‌న్నాహాల్లో ఉన్నాడు. ఈ క్ర‌మంలో చిరు పాల్గొంటాడా లేదా అనేది సందేహంగా మారింది. నాగార్జున‌కు బాల‌య్య‌కు గ్యాప్ ఉన్న నేప‌థ్యంలో నాగ్ ఈ షోకు రావ‌డం డౌటే. మ‌రి ఇదే విష‌యాన్ని కేసీఆర్‌కి విన్న‌విస్తే.. ఆయ‌న బాల‌య్య ఫంక్ష‌న్‌కి వ‌స్తాడో రాడో చెప్ప‌లేం. ప్ర‌స్తుతం ఈ ప‌రిణామం బాల‌య్య‌కి ప‌రీక్ష‌గా మారింది.

తాను ఏరికోరి శాత‌క‌ర్ణిని కేసీఆర్‌కి చూపించాల‌ని భావిస్తే.. ఇప్పుడు ప‌రిస్థితి ఇలా మార‌డం ఏంట‌ని బాల‌య్య అనుకుంటున్నాడ‌ని తెలిసింది. మ‌రోప‌క్క‌, శాత‌క‌ర్ణి మూవీకి తెలంగాణ ప్ర‌భుత్వం వినోద‌ప‌న్నును మిన‌హాయించిన విష‌యం తెలిసిందే. అయితే కేసీఆర్ కోరిన మేర‌కే ఆయ‌న‌కు స్పెష‌ల్ షో వేస్తున్నందున ఆయ‌న వ‌చ్చే అవ‌కాశాలే ఎక్కువుగా ఉన్నాయి.

 

బాల‌య్య‌కు కేసీఆర్ భ‌లే ప‌రీక్ష పెట్టారే..!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts