బాహుబ‌లి టీం ల‌క్ష మందా!!

January 9, 2017 at 5:46 am
bahubali

ఈ శ‌తాబ్ద‌పు అద్భుత సృష్టిగా నిలిచిపోయిన బాహుబ‌లి.. ఇప్ప‌టికే అనేక రికార్డులుసొంతం చేసుకుంది. ఇది పాత విష‌యం. కానీ, ఇప్పుడు విడుద‌ల‌కు సిద్ధ‌మైన బాహుబ‌లి-2 మ‌రో అరుదైన రికార్డును న‌మోదు చేసుకుంది. ఈ మూవీ షూటింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. దీంతో మూవీకి ప‌నిచేసిన టెక్నీషిన్లు, ఆర్టిస్టులు అంద‌రూ క‌లిసి ఓ వేడుక చేసుకున్నారు. ఈ సంద‌ర్భంగా తెలిసిందేంటంటే.. బాహుబ‌లికి మొత్తం ప‌నిచేసిన టీం ల‌క్ష మంది అని!! ఈ సంఖ్య ఓ ర‌కంగా రికార్డే! హాలీవుడ్ మూవీల్లో కూడా ఇంత భారీ సంఖ్య‌లో టీం ఉండ‌దు.

అలాంటిది జ‌క్క‌న్న బాహుబ‌లి టీం ఇంత సంఖ్య‌లో ఉండ‌డం మ‌రో రికార్డేన‌ని అంటున్నారు. లాస్ట్ డే సంద‌ర్భంగా బాహుబ‌లి టీం అంతా ఎంతో హ్యాపీగా ఫీల‌వ‌డంతో పాటు ఒక్క‌సారిగా ఉద్వేగానికి కూడా లోనయ్యారు. అదే సమయంలో దేశం గర్వించదగ్గ సినిమాకు పనిచేసినందుకు గర్వంగా ఫీల్ అయ్యారు. యూనిట్ సభ్యులు ఆఖరి రోజు షూట్ ను సరదాగా ముగించారు. ఇక్క‌డ ఇంతో ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన విష‌యం ఏంటంటే.. యూనిట్ సభ్యులంతా లాస్ట్ డే నాడు ఒకే రకమైన టీషర్లు వేసుకొని ఫోటోలు దిగుతూ సందడి చేశారు.

వీరి టీషర్ట్ ల పై ఉన్న మ్యాటర్ మ‌రింత‌ ఆసక్తికరంగా మారింది. ‘ఒక అద్భుతమైన అనుభవం, 5 సంవత్సరాలు, 613 రోజుల షూటింగ్, 2 బ్లాక్ బస్టర్లు, లక్ష మంది యూనిట్, ఇంకా నేను’ అంటూ రాసి ఉన్న టీషర్ట్ లను బాహుబలి యూనిట్ ధరించింది. అయితే మిగతా అన్నింటి సంగతీ ఎలా ఉన్నా.. బాహుబలి సినిమాకు లక్షమంది యూనిట్ సభ్యుల పని చేశారన్న లైన్ మరింత ఆసక్తి కలిగిస్తోంది. మొత్తానికి జ‌క్క‌న్న ఈ ఏడాది ఎన్ని రికార్డులు బ‌ద్ద‌లు కొడ‌తాడో చూడాలి.

 

బాహుబ‌లి టీం ల‌క్ష మందా!!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts