మహేష్ కథ కోసం చూస్తున్న ఎన్టీఆర్!

October 26, 2016 at 5:37 am
mahesh-ntr

జనతా గ్యారేజ్ సినీమా తరువాత చేయబోయే సినిమాల విషయం లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ బాగా ఆచి తూచి అడుగులు వేస్తున్నాడు. అయితే ఇప్పుడు ఎన్టీఆర్ గురించి గాసిప్ ఒకటి ఫిలిం నగర్ లో చక్కెర్లు కొడుతుంది. అదేంటంటే ఎన్టీఆర్ త్రివిక్రమ్ తో సినిమా చేయాలనీ చాలాకాలం నుంచి చూస్తున్నాడు.

అయితే ఇప్పుడు ఎన్టీఆర్ సన్నిహితులు త్రివిక్రమ్ తో మాట్లాడి ఒప్పించారని. ఆ సినిమాకోసం త్రివిక్రమ్ ఒక లైన్ కూడా ఎన్టీఆర్ కి చెప్పాడట అదివిని ఎన్టీఆర్ కూడా బాగానే ఉందని చెప్పి, మహేష్ కోసం తయారు చేసిన లైన్ కూడా చెప్పమని అడిగాడట. దాన్తో త్రివిక్రమ్ కి మహేష్ కోసం తాను అనుకున్న లైన్ చెప్పక తప్పలేదట.

అది విన్న తరువాత బాగా నచ్చటం తో ఆ స్టోరీ తోనే చేద్దాం అని ఎన్టీఆర్ అడిగాడట దానికి త్రివిక్రమ్ నో చెప్పాడట. ఆ లైన్ మహేష్ కి ఆల్రెడీ చెప్పేసి ఓకే అనుకున్నాం ఇప్పుడు అది మీతో చేయటం కుదరదని చెప్పేశాడట.

మహేష్ కథ కోసం చూస్తున్న ఎన్టీఆర్!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts