లారెన్స్‌పై ఫైర్ అయిన టాప్ హీరో

October 26, 2016 at 5:35 am
raghava lawrence

రాఘ‌వేంద్ర లారెన్స్‌.. ఈ త‌రం సినిమా ప్రియుల్లో ఈ పేరు తెలియ‌నివారు తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఎవ‌రూ ఉండ‌రేమో… త‌ను క్రియేట్ చేసిన మాస్ మెచ్చేస్టెప్పుల‌తో ఎంద‌రో అభిమానుల‌ను త‌యారు చేసుకున్నాడీ నృత్య ద‌ర్శ‌కుడు.  కారు డ్రైవ‌ర్‌గా జీవితం మొద‌లుపెట్టి.. ర‌జ‌నీకాంత్ ఆశీస్సుల‌తో కొరియోగ్రాఫ‌ర్‌గా  ట‌ర్న్ తీసుకుని ప్ర‌భుదేవా త‌రువాత ఆ  స్థాయిలో పేరు సంపాదించుకున్నాడు. చివ‌ర‌కు ద‌ర్శ‌కుడిగానూ అవ‌తార‌మెత్తి త‌న స‌త్తా నిరూపించుకున్నాడు.

ఇక లారెన్స్‌ డైరెక్టర్‌గా మారాక అత‌డు త‌మిళంలో తీసిన సినిమాల‌న్నీ తెలుగులోనూ విడుద‌ల‌య్యాయి. ఇత‌గాడు తెలుగులోనూ కొన్ని స్ట్రైట్ సినిమాలకు ద‌ర్శ‌కుడిగా ప‌ని చేశాడు. అయితే.. అతడి  సినిమాల్లో కొన్ని హిట్ కొడితే.. మరికొన్ని డిజాస్టర్‌గా మిగిలిపోయాయ‌నే చెప్పాలి. ఈ విష‌యంలో నిర్మాత‌ల‌తో లారెన్స్‌కు పంచాయితీలు కూడా జ‌రిగాయి. త‌ను తీసే సినిమాల‌కు స్థాయికి మించి  ఖ‌ర్చుపెట్టిస్తాడ‌ని కొంత‌మంది తెలుగు నిర్మాతలు లారెన్స్‌పై ఆరోప‌ణ‌లు కూడా గుప్పించారు.చాలా మంది నిర్మాతలు లారెన్స్‌తో సినిమాలు తీయకూడదని నిర్ణయించుకున్నారు.

ఇదిలా ఉండ‌గా లారెన్స్ చారిటీ కార్య‌క్ర‌మాల‌కు బాగా వెచ్చిస్తుంటాడ‌ని, త‌న సంపాద‌న‌లో చెప్పుకోద‌గ్గ మొత్తం ఇత‌రుల‌కు సాయం చేస్తుంటాడ‌ని కూడా మ‌ద్రాసు సినీవ‌ర్గాల్లో వార్త‌లు వ‌స్తుంటాయి. తాజాగా టాలీవుడ్‌కు చెందిన ఓ టాప్ హీరో… లారెన్స్ గురించి చులకనగా మాట్లాడాడట. ఓ మూవీకి సంబంధించిన షూటింగ్ సమయంలో ఆ హీరో… లారెన్స్‌ను తీసేసినట్టు మాట్లాడాడని, అదే స‌మ‌యంలో కొంద‌రు త‌మిళ టెక్నీషియ‌న్లు ఆ హీరో వ్యాఖ్య‌ల‌ను అక్క‌డిక‌క్క‌డే ఖండిస్తూ అడ్డు చెప్పార‌ని ఫిల్మ్‌నగర్ వర్గాలు అంటున్నాయి.

లారెన్స్ గురించి కించ‌ప‌రుస్తూ మాట్లాడొద్దని, లారెన్స్ తన సంపాదనలో ఎక్కువ మొత్తాన్ని సమాజ సేవ కోసమే ఖర్చు చేస్తాడ‌ని, అలా సాయం పొందిన వారిలో తాను ఒకడినని ఓ టెక్నీషియన్ ఆ హీరోకు చెప్పాడట‌. దీంతో షాక్ అవ్వ‌డం ఆ హీరో వంతు అయ్యింద‌ట‌. మ‌రి తెలుగు ఇండ‌స్ట్రీలో ఉన్న ఓ టాప్ హీరోతో ఒక చిన్న టెక్నీషియన్.. అదీ హైద‌రాబాద్‌లో ఇలా మాట్లాడటం నిజ‌మై ఉంటుందా… అంటూ ఫిల్మ్ న‌గ‌ర్ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది.

లారెన్స్‌పై ఫైర్ అయిన టాప్ హీరో
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts