వాళ్లంటే అనుమానం..వీళ్లంటే అభిమానం–పవన్

జల్లికట్టు ..ఇదొక దివ్య పదమైపోయింది గత నాలుగు రోజులుగా..ఓ మూగ జీవం వెంట వందలమంది  వెంటపడి చేసే వికృత చేష్టలకు పెట్టిందిపేరు జల్లికట్టు.దీన్ని నిషేధిస్తూ భారత సుప్రీం కోర్ట్ తీర్పునిస్తే మొత్తం తమిళనాడంతా ఏకమై స్వచ్ఛందంగా అహింసా మార్గం లో తమ నిరసన తెలియజేసింది.దీనికి సో కాల్డ్ సెలెబ్రిటీలు ఫ్రీ గా పబ్లిసిటీ తో పాటు ఉచిత మద్దతు ప్రకటించేశారు.

ఇదంతా అయిపోగా జల్లుకట్టు నిషాదాన్ని ఎత్తేస్తూ కేంద్రం ఆర్డినెన్స్ ఇవ్వగా ఇప్పుడు తమిళుల్ని చూసి మనం ఎంతైనా నేర్చుకోవాల్సింది ఉందంటూ ఉచితోపన్యాసాసాలకు దిగారు సదరు సెలబ్రిటీ కం పొలిటికల్ కం సోషల్ లీడర్స్.ఇందులో అంత నేర్చుకునేదేముందో అంతుపట్టడం లేదు.అయినా ముఖ్య మత్రులకు సాష్టాంగ నమస్కారం చేసే సంస్కారం ఉన్న నాయకులకు వత్తాసు పలికే తమిళుల్ని చూసి తెలుగు జాతి నేర్చుకోవాలంటూ ఉపన్యాసాలివ్వడం సిగ్గు చేటు.

మనకంటూ ఓ చరిత్ర వుంది..తెలుగోడికి ఓ సంస్కృతి వుంది..అందులో ఇంకా చేవ బ్రతికే వుంది..పరాయి పరువుమాలిన సంస్కృతి అరువు తెచ్చుకునే ఖర్మ మనకేంటి.అయినా ఏ దేశ సేవనో సామాజిక సేవనో ఏ జాతినైనా చూసి నేర్చుకోమనడం సంస్కారం..ఇక్కడేమో ఓ వికృత క్రీడకు ఓ జాతి మద్దతు పలుకుతుంటే దాన్ని చూసి మనల్ని నేర్చుకోమనడం సిగ్గు సిగ్గు.

జంతువుల్ని చంపడం వేరు..ఆటవిక వినోదాలకు హింసించడం వేరు..ఈ చిన్నపాటి తేడా కూడా తెలీకుండా వితండ వాదం వాదిస్తూ పబ్బం గడుపుకుంటున్నారు ఈ సెలబ్రిటీ రాజకీయనాయకులు.అయినా పదిమంది పరుగెడుతుంటే గొఱ్ఱెలమందలా మనమూ కాలు కదిపేయడమేనా? మంచి చెడు అన్న విచక్షణ ఉండక్కర్లేదా..ఎవరికి వారు మనం ఓ కట్టే వేసి చలికాచుకుందా ..రేపన్న రోజున మనకేం ఇబ్బంది ఉండదు అన్న వ్యక్తిగత స్వార్థం తప్ప ఇంకో అజెండా లేదు.

ఈ మొత్తం వ్యవహారానికి సంస్కృతి..సాంప్రదాయం అన్న ముసుగు తొడిగేసారు.మన తెలుగు సూపర్ స్టార్స్ సైతం గొంతు కలిపి నినదించారు పాపం ఈ దేశ సేవలో.పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారయితే ఇంకో అడుగు ముందుకేసి తమిళుల్ని చూసి మనం ఎంతైనా నేర్చుకోవాల్సింది ఉందంట.అదే స్ఫూర్తి తో మనం కూడా ప్రత్యేక హోదా కోసం గొంతు విప్పాలంట.ఇక్కడ కామెడీ ఏంటంటే జెనసేనాధిపతికి మన రాజకీయ నాయకుల పైన కొంచెం అనుమానం ఉందట ఈ విషయం లో, అదే ప్రజలపై మాత్రం ఎనలేని నమ్మకం ఉందంట.అది సరే ఇంతకీ సేనాధి పతి ఏమి చేస్తారో మరి ఈ విషయం లో అనేది మాత్రం సెలవివ్వలేదు.వాళ్ళను చూసి నేర్చు కోవాలి..వీళ్లంటే నమ్మకం లేదు..వాళ్లంటే నమ్మకం..ఇలా హితబోధలతో ఒంకెన్నాళ్లో పబ్బం గడుపుతారో చూద్దాం.

జనసేనో..ఇంకో సెనో ..సేనాధిపతో లేక ఆరవ సంస్కృతి సంప్రాదాయాలో మనల్ని నడపక్కర్లేదు..తెలుగు జాతి ఓపిక హిమాలయం.అది కరిగిందో ఆపడం ఎవ్వరి తరమూ కాదు.మీడియా ముసుగులో ప్రత్యేక హోదాకి వక్రభాష్యం చెబుతూ పబ్బం గడుకుంటున్న ఈ రాజకీయ సెలెబ్రిటీలు ఎందరో తెలుగోడి ఓపిక అనే బలహీనత పై బ్రతుకువెళ్లదీస్తున్నారు అదే నశించిన రోజున వీళ్లందరి పునాదులు పెకలించుకు పోవడం ఖాయం.