శుభాకాంక్షలతో సైడ్ అయిన పవర్ స్టార్

January 7, 2017 at 10:58 am
power

అదిగో వస్తాడు..ఇదిగో వస్తాడు..అన్న రాయబారం..వదిన ఆహ్వానం అంటూ మీడియా మొత్తం కోడై కూస్తూ వస్తోంది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన అన్న చిరంజీవి తొమ్మిదేళ్ల తరువాత నటించిన మెయిలు రాయి సినిమా ఖైదీ NO 150 వేడుకకి వచ్చేవిషయమై గత కొద్దీ రోజులుగా ఎవరికీ తోచిన గాలి వార్తలు వాళ్ళు ప్రచారం చేస్తున్నాయి.

అయితే ఈ రోజు జరగబోయే ఈ వేడుకకి పవన్ రావట్లేదనేది దాదాపుగా ఖాయమైంది.చరణ్,మా వదిన సురేఖ గారి నిర్మాణం లో వస్తోన్న తొలి చిత్రమే చిరంజీవి గారి 150 వ చిత్రం కావడం నాకు చాలా ఆనందంగా వుంది.ఖైదీ నెంబర్ 150 ప్రేక్షకుల్ని అలరిస్తుందని నమ్ముతున్నాను.ఈ చిత్రం లోని నటీ నటులకు సాంకేతిక నిపుణులకు నా మనఃపూర్వక శుభాకాంక్షలు.అదీ మేటర్.

నేను రావట్లేదని ఈ రంకంగా కూడా చెప్పొచ్చు అనమాట.ఇప్పటికే మెగా ఫామిలీ ఫంక్షన్ కి  ఉద్దేశ పూర్వకంగానే పవన్ రావడం లేదని ఫామిలీ అంతా గుర్రుగా వున్నా మాట వాస్తవం.ఇదే విషయమై ఆ మధ్యన నాగబాబు బహిరంగంగానే పవన్ శైలిని విమర్శించారు.అయినా ఫంక్షన్స్ అంటే అలర్జీ అంటే అది వేరే విషయం.. ఒక వైపేమో నితిన్,సప్తగిరి లాంటి వాళ్ళ ఫంక్షన్స్ కి వెల్తూ అదే టైం లో తాను ఇక్కడ ఉండడానికి కారణమైన తన అన్న మెగా స్టార్ అటు ఫామిలీ ఇటు సినీ ఫంక్షన్స్ కి దూరంగా ఉండడం కొంత మంది మెగా అభిమానులకి కూడా రుచించడం లేదు.

శుభాకాంక్షలతో సైడ్ అయిన పవర్ స్టార్
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts