శ్రీను వైట్ల సీన్‌లోకి వ‌చ్చేశాడు..

January 6, 2017 at 5:11 pm
sreenu vaitla

నిన్న‌టి వ‌ర‌కు టాలీవుడ్‌లో శ్రీను వైట్లను ప‌ట్టించుకునే వారే లేరు. ఆగ‌డు – బ్రూస్‌లీ దెబ్బ‌కు శ్రీను వైట్ల ప‌రిస్థితి అత్యంత ద‌య‌నీయంగా మారిపోయింది. ఎట్ట‌కేల‌కు మెగా హీరో వ‌రుణ్‌తేజ్‌తో మిస్ట‌ర్ సినిమాను ప‌ట్టాలెక్కించాడు. ఇండ‌స్ట్రీ ఇన్న‌ర్ టాక్ ప్ర‌కారం ఈ సినిమాకు శ్రీను వైట్ల రెమ్యున‌రేష‌న్ లేకుండానే చేస్తున్నాడ‌ని…సినిమా రిలీజ్ అయ్యాక వ‌చ్చే లాభాల్లో వాటా తీసుకునేలా ఒప్పందం కుదిరింద‌న్న ప్ర‌చారం కూడా జ‌రుగుతోంది.

ఇదిలా ఉంటే శ్రీను వైట్ల మ‌ళ్లీ స్టార్ అయిపోతున్నాడు. మిస్ట‌ర్ టీజ‌ర్ అలా రిలీజ్ అయ్యిందో లేదో శ్రీను వైట్ల‌పై ఇండ‌స్ట్రీలో ప్రశంస‌లు ఓ రేంజ్‌లో కురుస్తున్నాయి. మిస్ట‌ర్ టీజ‌ర్ శ్రీను వైట్ల రొటీన్ ఫార్ములా నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చాడ‌ని చెప్పేలా ఉందంటున్నారు.

ఈ ఒక్క టీజ‌ర్‌తో మిస్ట‌ర్‌పై భారీ హైప్ వ‌చ్చేసింది. ఇదిలా ఉంటే ఇప్పుడు అగ్ర హీరో నాగార్జున శ్రీను వైట్ల‌కు పిలిచి మ‌రీ ఛాన్స్ ఇచ్చాడ‌ని స‌మాచారం. గ‌తంలో నాగ్ – శ్రీను వైట్ల కాంబినేష‌న్‌లో కింగ్ సినిమా వ‌చ్చింది. ఆ సినిమా యావ‌రేజ్ అయినా శ్రీను వైట్ల కామెడీ టైమింగ్‌, టేకింగ్ నాగ్‌కు బాగా న‌చ్చాయ‌ట‌.

ఈ క్ర‌మంలోనే నాగార్జున నాగ చైత‌న్య‌తో సినిమా కోసం శ్రీను వైట్ల‌కు ఆఫ‌ర్ ఇచ్చిన‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. ఓ మంచి స్క్రిఫ్ట్‌తో ర‌మ్మ‌ని కూడా శ్రీను వైట్ల‌కు నాగ్ చెప్పాడ‌ట‌. ఈ సినిమా కూడా స‌క్సెస్ అయితే శ్రీను వైట్ల తిరిగి సీన్‌లోకి వ‌చ్చిన‌ట్లే..!

 

శ్రీను వైట్ల సీన్‌లోకి వ‌చ్చేశాడు..
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts