షాక్‌: జ‌గ‌న్‌ను క‌లుస్తోన్న బాల‌య్య‌

January 5, 2017 at 2:03 pm
balakrishna

యువ‌ర‌త్న బాలకృష్ణ 100వ చిత్రం ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ ఈ సంక్రాంతికి రాబోతోంది. క్రిష్ డైరెక్ష‌న్‌లో హిస్టారిక‌ల్ నేప‌థ్యంలో తెర‌కెక్కిన ఈ సినిమా ఈ నెల 12న వ‌ర‌ల్డ్‌వైడ్‌గా గ్రాండ్‌గా రిలీజ్ అవుతోంది. ఇదిలా ఉంటే ఈ సినిమా త‌ర్వాత బాల‌య్య 101వ సినిమా ఎవ‌రి డైరెక్ష‌న్‌లో ఉంటుంద‌నేదానిపై కొద్ది రోజులుగా ర‌క‌ర‌కాల వార్త‌లు వ‌స్తున్నాయి.

ముందుగా బాల‌య్య 101వ సినిమా కృష్ణ‌వంశీ డైరెక్ష‌న్‌లో రైతు సినిమా ఉంటుంద‌నుకున్నారు. ఈ సినిమా దాదాపు సెట్స్‌మీద‌కు వెళుతుంద‌నుకుంటున్న టైంలో క‌థ న‌చ్చ‌క‌పోవ‌డంతో బాల‌య్య రిజెక్ట్ చేసేశారు. ఇదిలా ఉంటే బాల‌య్య 101వ సినిమాగా మ‌రో ఆస‌క్తిక‌ర వార్త ఇండ‌స్ట్రీలో వినిపిస్తోంది.

టాలీవుడ్ డేరింగ్ అండ్ డాషింగ్‌ డైరెక్టర్ పూరి జగన్నాథ్ వినిపించిన స్టోరీని బాలయ్య ఓకే చేశాడని, బహుశా ఈ సినిమా షూటింగ్ త్వరలోనే స్టార్ట్ కావచ్చని అంటున్నారు. మ‌రో ట్విస్ట్ ఏంటంటే ఈ సినిమాను కేవ‌లం ఆరు నెల‌ల్లోనే కంప్లీట్ చేసేస్తార‌ట‌.

ఇక పూరి మ‌హేష్‌, రామ్ లాంటి వాళ్ల‌తో సినిమాలు చేయాల‌నుకున్నా మ‌నోడి ఇజం రిజ‌ల్ట్ త‌ర్వాత వారు ఎవ్వ‌రూ పూరిని ద‌గ్గ‌ర‌కు రానిచ్చే ప‌రిస్థితి లేదు. దీంతో ఓ ప‌వ‌ర్ ఫుల్ మాస్ స్టోరీని రెడీ చేసుకుని…బాల‌య్య‌ను ఒప్పించిన‌ట్టు తెలుస్తోంది. సో బాల‌య్య త్వ‌ర‌లోనే పూరి జ‌గ‌న్‌తో సినిమాకు రెడీ అవుతున్న‌ట్టే..!

షాక్‌: జ‌గ‌న్‌ను క‌లుస్తోన్న బాల‌య్య‌
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts