సీక్రెట్ మ్యారేజ్ చేసుకున్న రాజ్‌త‌రుణ్‌

September 24, 2016 at 10:09 am
raj-tarun-anchor-lasya

ఇప్పుడు ఈ వార్త టాలీవుడ్‌లో పెద్ద సంచ‌ల‌నంగా మారిపోయింది. వ‌రుస హిట్ల‌తో దూసుకుపోతోన్న యంగ్ హీరో రాజ్‌త‌రుణ్ యాంక‌ర్ లాస్య‌ను సీక్రెట్‌గా మ్యారేజ్ చేసుకున్నాడ‌న్న మాటే అంద‌రి నోళ్ల‌లోను వినిపిస్తోంది. దీనిపై సోష‌ల్ మీడియాలో న్యూస్ ఒక్క‌టే గుప్పుమంది. గూగుల్‌లో చేస్తున్న హైఫై జాబ్‌ను వదిలేసిన లాస్య త‌న‌కు న‌చ్చిన యాంక‌రింగ్‌ను కేరీర్‌గా ఎంచుకుంది.

ఇక లాస్య కో-యాంకర్‌ రవితో లాస్య ప్రేమలో ఉందని ఎప్పట్నుంచో వార్తలు వినబడుతున్నాయి. ఈ వార్తలు ఇలా ఉండ‌గానే ఇప్పుడు ఆమె యంగ్ హీరో రాజ్‌త‌రుణ్‌ను పెళ్లి చేసుకున్న‌ట్టు వార్త‌లు రావ‌డం ఇంకా షాకింగ్‌గా మారింది. దీంతో లాస్య అభిమానులు, సినీ జ‌నాలు ఒక్క‌సారిగా షాక్ అయిపోయారు.

ఈ వార్త‌ల సంగ‌తి ఎలా ఉన్నా లాస్య, రాజ్‌తరుణ్‌ క్లోజ్‌గా ఉన్న ఫోటో ఒకటి ఇప్పుడు సోషల్‌ మీడియాలో ప్రచారంలో ఉంది. అంతే లాస్య‌-రాజ్‌త‌రుణ్ చాలా రోజుల నుంచి ప్రేమ‌లో మునిగి తేలుతున్నార‌ని..వీరిద్ద‌రి పెళ్లికి పెద్దలు అంగీక‌రించ‌డం లేద‌ని వార్త‌లు పుకార్లు – షికార్లు చేస్తున్నాయి.

సోషల్ మీడియాలో ఈ వార్త‌లు జోరుగా ట్రెండ్ అవుతున్నా అటు లాస్యగాని, ఇటు రాజ్‌త‌రుణ్‌గాని ఈ వార్త‌ల‌పై స్పందించ‌లేదు. వీరిద్ద‌రి మౌనానికి కార‌ణం ఏంటా ? అన్న సందేహాలు కూడా వ్య‌క్త‌మ‌వుతున్నాయి. మ‌రి వీరిద్ద‌రి మ‌ధ్య సంబంధం నిజ‌మా ? గాసిప్‌నా ? అన్న‌ది వీరు నోరు విప్పి చెప్పితే గాని తెలియ‌దు.

సీక్రెట్ మ్యారేజ్ చేసుకున్న రాజ్‌త‌రుణ్‌
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts