అంకుశం మళ్ళీ రాబోతుంది!

వెండితెరపై ఎన్ని పోలీస్ పాత్రలు వచ్చినా అంకుశం లో రాజశేఖర్ పోషించిన పోలీస్ పాత్ర ప్రత్యేకం అని చెప్పాలి. ఇంకా చెప్పాలంటే పోలీస్ పాత్రకి హీరోయిజం తెచ్చిన పాత్ర కూడా అదే. ఆ సినిమా లో రాజశేఖర్ పోలీస్ పాత్రకి ప్రాణం పోశారనే చెప్పాలి. అంతగా మెప్పించారు రాజశేఖర్ ఆ పాత్రని.

అయితే.. కొన్నేళ్లుగా వరుస పరాజయాలు ఎదుర్కొంటున్న రాజశేఖర్ మళ్ళీ సిల్వర్‌ స్క్రీన్‌పై మరోసారి పోలీస్‌గా దర్శనమిచ్చేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు.ప్రవీణ్ సత్తారు తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో రాజశేఖర్ పవర్‌ఫుల్‌ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడని చెప్పుకుంటున్నారు. ఈ సినిమా ‘డై హార్డ్’ అనే హాలీవుడ్ మూవీలా ఉంటుందని తెలుస్తోంది. ఆ సినిమాలో నటించిన ‘బ్రూస్ విల్లీస్’ రోల్‌లాగే రాజశేఖర్ పాత్ర ఉంటుందట.

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలు రాజశేఖర్ కి మంచి క్రేజ్ ను తెచ్చిపెట్టాయి. అయితే రాజశేఖర్ కి వున్న ఒకేఒక్క డ్రా బ్యాక్ వాయిస్. అయితే ఇంతకుముందు సాయి కుమార్ రాజశేఖర్ సినిమాలకి డబ్బింగ్ చెప్పేవారు. ఈసారికూడా సాయికుమార్ గొంతు రాజశేఖర్ కి అరువిస్తే సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది అని ఫిల్మ్ నగర్ టాక్.