అనిల్ కపూర్ డాటర్ న్యూడ్ ఫోటో వివాదం..

ఆ మధ్యన అమితాబ్ బచ్చన్ మనవరాలు బికినీ ఫొటోస్ సోషల్ మీడియా లో వైరల్ గా మారి పలు విమర్శలకు దారి తీసింది మరువకముందే మరో సెలబ్రిటీ అనిల్ కపూర్ కుమార్తె ఇంకో బాంబు పేల్చింది.ప్రస్తుతం సోషల్ మీడియా ఫీవర్ జనాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. కొందరు మంచి పనుల కోసం సోషల్ మీడియాను వేదిక చేసుకుంటే మరి కొందరు సెన్సేషన్స్ కోసం విచ్చల విడిగా ఫోటోలు, వీడియోలను షేర్ చేస్తున్నారు. వివరల్లోకేల్తే తాజాగా అనీల్ కపూర్ కూతురు ఓ న్యూడ్ ఫోటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి అందరిని ఆశ్చర్యపరిచింది.

ఒకప్పుడు స్టార్ హీరోగా ఉన్న అనీల్ కపూర్ కి ఇద్దరు కూతుళ్ళు ఒక కొడుకు వున్నారు. ముద్దుల కూతురు సోనమ్ కపూర్ ప్రస్తుతం బాలీవుడ్‌లో తన హవాను చాటుకుంటుంది. సోనమ్ తమ్ముడు హర్షవర్ధన్, మీర్జియా సినిమాతో హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. ఇక సోనమ్ సిస్టర్ రియా కపూర్ ఫ్యాషన్ డిజైనర్‌గా పనిచేస్తుంది. ఎవరి పనుల్లో వారు బిజీ బిజీ గా సక్సెస్ ఫుల్ గా దూసుకెల్తున్నారు. కాని రీసెంట్‌గా రియా పోస్ట్ చేసిన ఓ ఫోటో .. అందరిని ఒక్కసారిగా ఉలిక్కి పడేలా చేసింది. ఇటీవల సోనమ్, రియాలు ఫారిన్ లోని ఓ చెరువు దగ్గరకు వెళ్ళారు. వెళ్ళామా చక్కగా ప్రకృతిని ఆస్వాదించామా అన్నట్టుంటే మా గుర్తింపు ఏంటి అనుకున్నారో ఏమో అందులో న్యూడ్‌గా పడుకొని ఉన్న భామని తమ కెమెరాలో క్లిక్ మనిపించారు రియా సిస్టర్స్. ఆ తర్వాత ఈ ఫోటోని ఆన్‌లైన్‌లో పోస్ట్ చేయడంతో అభిమానులు ఒక్క సారిగా షాక్ కు గురయ్యారు. ఇంతకి విషయం ఏంటా అని ఆరా తీయడం మొదలు పెట్టారు వాళ్ళు వీళ్ళు .చివరగా తెల్చిన్దేంటంటే ఆ ఫోటోలో ఉన్న అమ్మాయి న్యూడ్ సూట్ వేసుకొని ఫోటో దిగిందట. ఆ అమ్మాయి ఎవరనేది మాత్రం సస్పెన్స్ గానే వుంది.ఇదీ అసలు సంగతి. మొత్తానికి రియా సోషల్ ఫీవర్ అనిల్అ కపూర్ కి, అభిమానులకి ముచ్చెమటలు పట్టించింది.