అనుష్క నిత్య విద్యార్ధి

అనుష్క అంటే ఇష్టపడని వారు ఉండరు. ఆన్‌ స్క్రీన్‌ గ్లామర్‌ ఒలకపోతలో ఎంత కమిట్‌మెంట్‌తో ఉంటుందో, ఆఫ్‌ స్క్రీన్‌ ట్రెడిషన్‌కి అంతే కమిట్‌మెంట్‌తో ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. ‘అరుంధతి’ ముందు అనుష్క వేరు. ఆ తరువాత అనుష్క వేరు. ‘అరుంధతి’ సినిమా ఆమెకు అంతగా స్టార్‌డమ్‌ తెచ్చిపెట్టింది. అంతకు ముందు వరకూ గ్లామర్‌ డాళ్‌గానే కనిపించిన అనుష్క హుందా అయిన పాత్రలకి ఆ తరువాత నుంచి కేరాఫ్‌ అడ్రస్‌ అయ్యింది. అయినప్పటికీ ఇప్పటికీ గ్లామర్‌ పాత్రలని మానలేదు.

అదే అనుష్క అంటే. అనుష్కని తన సక్సెస్‌ సీక్రెట్‌ ఏంటి అని అడిగితే, తన సక్సెస్‌కి సీక్రెట్‌ అంటూ ఏమీ లేదు. తనకొచ్చిన యాక్టింగ్‌ అంతంత మాత్రమే, డాన్సుల్లో అంత ప్రావీణ్యం లేదు అనే విషయం నాకు తెలుసు.కానీ ఏదో సాధించాలి అనే తపనే నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చింది. నన్ను నేను డెవలప్‌ చేసుకునే అవకాశం కల్పించింది అంటూ క్యూట్‌ క్యూట్‌గా చెప్పేస్తోంది స్వీటీ బ్యూటీ అనుష్క. సినీ రంగానికి వచ్చిన కొత్తల్లో తానెలా ఉన్నానో, ఇప్పటికీ అలానే ఉన్నాను. అంటే ఇంకా ఏదో నేర్చుకోవాల్సింది ఉంది అనే తపన తనలో అలాగే ఉందంటోంది.

సినిమా సినిమాకీ, ఏదో ఒక కొత్త విషయం నేర్చుకోవాలనే ప్రయత్నం చేస్తూనే ఉంటానంటోంది జేజమ్మ. సీనియర్‌ హీరోయిన్‌ అనే గర్వం ఎక్కడా ప్రదర్శించదు. జూనియర్‌ హీరోలతోనూ, స్టార్‌ హీరోలతోనూ కూడా ఎంతో హుందాగా వ్యవహరిస్తూ ఉంటుంది. అదే ఆమెను అందరికీ స్వీటీని చేసింది. ప్రస్తుతం ‘బాహుబలి ది కన్‌క్లూజన్‌’ సినిమాలోనూ, నాగార్జున హీరోగా వస్తోన్న ‘ఓం నమో వేంకటేశాయ’లో ప్రత్యేక పాత్రలోనూ అనుష్క నటిస్తోంది.