అలీ మారాడని ఎవరన్నది?

700 పైగా సినిమాల్లో నటించాడు..తెలుగులో సీనియర్ కమెడియన్స్ లో ఒకడు.బాల్యనటుడిగా సినీరంగ ప్రవేశం చేసి ఇప్పటికి తెలుగు జనాల్ని తన మార్క్ కామెడీతో సినిమాల్లో అలరిస్తూనే వున్నాడు.అర్థమైవుంటుందనుకుంటా తనెవరో కాదు ఆలీనే అని.అలీ చేసే కామెడీ కంటే అతను చేసే కాంట్రవర్సీ నే ఎక్కువగా మాట్లాడుతోంది ఈ మధ్య.

ఆ మధ్య అన్నపూర్ణ సుంకర అనే ఒక అమ్మాయి అమెరికా నుండి అలీ చేసే పచ్చి పిచ్చి కామెంట్స్ పైన విపరీతంగా స్పందించి సంచలనం రేపింది.ఆ దెబ్బ ఆలీకి బాగానే తగిలింది.ఎంతగా అంటే దొరికిన టీవీ చానెల్స్ అన్నిటికి వచ్చి వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది.అంతేనా తెలిసిన నటీ నటులందరితో అలీ మంచోడు అని సర్టిఫికెట్ ఇచ్చుకోవాల్సివచ్చింది.

ఇక తాజాగా సింగపూర్ లో జరిగిన సైమా అవార్డ్స్ ఫంక్షన్స్ కి ఆలీ మంచు లక్ష్మితో కలిసి వ్యాఖ్యాతగా వ్యవహరించాడు.ఈ ప్రోగ్రాం ని టీవీ ల్లో చూస్తున్నంత సేపు ఎప్పుడెప్పుడు అలీ మాట్లాడటం మానేస్తాడా అనిపించేంతగా బూతుపురాణం పఠించాడు.

ఏ ఒక్కరినీ వదల్లేదు..అందరిమీద బూతు జోకులే..వాటికి నవ్వాలో..ఏడవాలో అర్థం కాదు..సీనియర్ జూనియర్ ఆడా మగా అని తేడా లేదు..ఎవరికి ఎవరితో లింకులేసి మాట్లాడుతున్నాడో అర్థం కానంత మైకం లో బూతు స్మరణయే చేసాడు సైమా ఫంక్షన్ అంతా.

అయినా అలీ సినిమాల్లో మంచి ఆక్టర్ అయ్యుండొచ్చు,నిజజీవితం లో మంచి మనిషే అయ్యుండొచ్చు..వాటన్నిటికీ మించి పది మంది ముందు ఎంత పద్దతిగా మాట్లాడామన్నదే వాటికంటే గొప్ప గుణం.మన మాటలు విన్న వారు చుసిన వారు సిగ్గుతో తలదించుకునేంత అవమానకరంగా మాట్లాడే మనిషి ఎంత మంచివాడైతే ఎందుకు.నవ్వించడానికి నవ్వులపాలు చేయడానికి చాలా చిన్న వెంట్రుక వాసి తేడా ఉంటుంది..ఆ తేడా ఆలీకి ఎప్పుడు తెలుస్తుందో ఏమో.