‘అల్లరి’ ఇంట ఆడపిల్ల అంట

తెలుగు సినిమా చరిత్రలో ఈ వీ వీ సత్యనారాయణ తనకంటూ కొన్ని పేజీలు లిఖించుకున్నారు.తెలుగు ప్రేక్షకులపై దర్శకుడిగా తనదైన ముద్రను వేశారు ఈవీవీ.ఆయన తదనంతరం ఆయన వారసులుగా ఆర్యన్ రాజేష్, నరేష్ లు సినిమాల్లో కొనసాగుతూ వచ్చారు. అయితే ఆర్యన్ మొదట్లో అడపాదడపా సినిమాలు చేసినా పెద్దగా గుర్తింపు రాకపోవడంతో ఈ మధ్య వెండితెరపై కనిపించలేదు.

అయితే అల్లరి సినిమాతో తన పేరునే అల్లరి నరేష్ గా మార్చేసుకుని నాన్న నమ్మిన హాస్యాన్నే తాను కూడా ట్రేడ్ మార్క్ గా చేసుకుని అల్లరి నరేష్ మాత్రం కెరీర్ లో దూసుకుపోయాడు.తండ్రి మరణానంతరం ఆర్యన్ రాజేష్ కి కొడుకు పుట్టగా,ఈవీవీ గారే మళ్ళీ తమ దగ్గరికొచ్చాడంటూ సంబరపడ్డారు ఈ అన్నదమ్ములిద్దరూ.ఇప్పుడు అల్లరి నరేష్ కి కూడా ఓ పాపా పుట్టడంతో వారింట సంబరం రెట్టింపయింది.

చిన్న పెద్ద అని తేడా లేకుండా అందరూ కామెడీ ట్రాక్ నే మెయిన్ ట్రాక్ గా చేసుకుని సినిమాలు తీస్తుండడం తో రేస్ లో అల్లరి నరేష్ కొంత వెనక పడ్డ మాట వాస్తవం.కూతురి రాకతో అయినా ఈ అల్లరోడి ఫేట్ మారుతుందేమో చూడాలి.కంగ్రాట్స్ అండ్ అల్ ది బెస్ట్ టు అల్లరి నరేష్.