ఆడ, మగ కలవకుండానే 

సృష్టి ధర్మం ఏంటంటే, ఆడ మగ కలవడం. ఆ కలయిక సంతానోత్సత్తికి దోహదపడటం. కానీ ట్రెండ్‌ మారింది. ఆడ, మగ ఒకరితో ఒకరికి పని లేకుండానే సంతానోత్పత్తి జరిగిపోతోంది. బాలీవుడ్‌ నటుడు తుషార్‌కపూర్‌ ఇటీవల ఓ బిడ్డకు తండ్రి అయ్యాడు. అతనికి ఇంకా పెళ్ళి కాలేదు. సుస్మితాసేన్‌కి ఇద్దరు పిల్లలున్నారు. వారిని ఆమె పెంచుకుంటోంది. అమీర్‌ఖాన్‌ సరోగసి ద్వారా తండ్రి అయ్యాడు. షారుక్‌ఖాన్‌ తన భార్య ద్వారా ఇద్దరు పిల్లలకు ముందే తండ్రి అయినా, సరోగసి ద్వారా ఇంకో బిడ్డకు తండ్రిగా మారాడు. తల్లిదండ్రులు అయ్యే అవకాశం లేనివారికి సరోగసి పెద్ద వరం. కానీ అసలు పెళ్లే అవకుండా సరోగసి ఏంటి? అని ఎవరేమనుకున్నాసరే, తాను డోన్ట్‌ కేర్‌ అంటున్నాడు తుషార్‌కపూర్‌.

బ్రిటన్‌ మోడల్‌ జోడీ మార్ష్‌ అయితే పెళ్ళి చేసుకోకుండా, బాయ్‌ఫ్రెండ్‌తో కలవకుండా సరోగసి మార్గంలో తల్లి అవుతానంటోంది. ప్రపంచమంతటా ఈ వింత పోకడ గిరగిరా తిరిగేస్తోంది. పూర్వకాలంలో గాల్లోంచి దేవుళ్ళు పిల్లల్ని సృష్టించేవారని పురాణాల్లో చదువుకున్నాం. ఇది సాంకేతిక విప్లవం. గాల్లోంచి కాదుగానీ, సృష్టి ధర్మానికి విరుద్ధంగా పిల్లలు పుట్టుకొస్తున్నారు. నవ్వాలో ఏడవాలో తెలియని వింత ఇది. భవిష్యత్తులో మగ, ఆడ మధ్య సంబంధాలు పూర్తిగా శారీరక అవసరాలకు పరమితమవడమో లేదంటే అసలు ఆ అవసరమే లేకపోవడమో జరగవచ్చు. అంతా కలికాలం.