ఆర్కే ..నాకొడకా..నిన్ను చంపేస్తా..

ఇదేదో సినిమా లో హీరో విల్లన్ మధ్య సంభాషణ కాదు..సాక్ష్యాత్తు మంగళగిరి నియోజక వర్గ ఎమ్మెల్యే కి ఓ అధికార మదం తలకెక్కిన ఆగంతకుడు రాసిన ఉత్తర సారాంశం ఇది.ఓటుకు నోటు కేసులో పీకల్లోతు కష్టాల్లో కూరుకు పోయి తెలంగాణాలో పార్టీ జెండా పీకేసే స్థాయికి పడిపోయి హైదరాబాద్ లో దుకాణం సర్దేసి అమరావతికి మకాం మార్చేసిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తదనంతర పరిణామాల్లో అనూహ్యంగా ఈ కేసునుండి గట్టెక్కే దశలో మంగళగిరి వైసీపీ మ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి దీనిపై కోర్టుమెట్లెక్కడం హై కోర్ట్ దీనిపై స్పందించి పునర్విచారణకు ఆదేశించడం తెలిసిందే.

దీనిపై మన నిప్పు చంద్రబాబు ఎప్పటిలాగే స్టే తెచ్చేసుకున్నారు..మాటకు ముందు నేను నిప్పు నా ముందు అందరూ తుప్పు అని ఊదరగొట్టే చంద్రబాబు ఏ ఒక్క కేసునైనా ధైర్యంగా ఎదుర్కొన్నాడా..కేసనగానే విచారణ జరగకుండా అడ్డుపడటమే నిప్పు లక్షణమా..పైగా నా అంత నీతిమంతుడు లేదంటూ ఆస్తుల ప్రకటన అంటూ అప్పుడప్పుడూ కామెడీ చేస్తుంటారు బాబుగారు.
నిజంగా చంద్రబాబు నిప్పో..తుప్పొ చెప్పాల్సింది కోర్టులు..అయితే పాపం బాబుగారు ఆ అవకాశం కోర్టులకిస్తే కదా..నేను నిప్పు అని సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటూ ఉండడం దానికి భజన మీడియా తందానా అనడం షరా మాములే.

అయితే నిప్పు నారా వారిపై సుప్రీం కు వెళ్లే ఆలోచనలో ఉన్న ఎమ్మెల్యే ఆర్కే కి ఓ ఆగంతకుడు రాసిన వుత్తరం కలకలం సృష్టిస్తోంది..అరేయ్..ఒరేయ్..అంటూ..నిన్ను చంపేస్తా..నీ నియోజక వర్గం లోనే చంపేస్తా..మా నాయకుడి మీదే కేసు పెడతావా..నీకివే ఆఖరిరోజులు..మా చేతిలో అయిపోయావ్ నాకొడకా అంటూ బెదిరింపులకు దిగారు..కోర్ట్ కు పోతేనే ఇలా ఉంటే ఇంకా కోర్ట్ కేసు విచారణ చేపడితే ఇంకేమైనా ఉందా..