ఆ కుర్ర హీరోతో బయటపడ్డ రకుల్ ఎఫైర్

టాలీవుడ్‌లో ఒక‌ప్పుడు అనామ‌క హీరోయిన్ అయిన ర‌కుల్‌ప్రీత్‌సింగ్ ఇప్పుడు గోల్డెన్‌గ‌ర్ల్‌గా మారిపోయింది. స్టార్ హీరోల‌తో వ‌రుస‌పెట్టి ఛాన్సులు కొట్టేస్తోన్న ఆమె ఇప్పుడు ఆమె క్రేజీ హీరోయిన్‌గా మారిపోయింది. గ‌తేడాది నాన్న‌కు ప్రేమ‌తో – స‌రైనోడు – ధృవ లాంటి మూడు బ్లాక్ బ‌స్ట‌ర్ బిగ్గెస్ట్ హిట్‌ల‌ను త‌న ఖాతాలో వేసుకున్న ఆమె ఇప్పుడు మ‌హేష్‌బాబుతో ఓ క్రేజీ ప్రాజెక్టులో న‌టిస్తోంది. ఈ యేడాది కూడా ఆమె న‌టించిన నాలుగైదు క్రేజీ ప్రాజెక్టులు రిలీజ్‌కు రెడీ అవుతున్నాయి.

ఈ స‌న్న‌న‌డుము నాజూకూ సుంద‌రి గురించి ఓ సంచ‌ల‌న వార్త ఇప్పుడు ఇండ‌స్ట్రీలో జోరుగా చ‌క్కెర్లు కొడుతోంది. ఈ అమ్మ‌డు టాలీవుడ్‌కు చెందిన ఓ యంగ్ హీరోతో పీక‌ల్లోతు ప్రేమ‌లో మునిగి తేలుతోంద‌ట‌. టాలీవుడ్‌లో ఓ స్టార్ ఫ్యామిలీకి చెందిన కండల హీరోతో ర‌కుల్ ప్రేమాయ‌ణం కొన‌సాగిస్తోంద‌ట‌. కొద్ది రోజులుగా హైద‌రాబాద్‌లోని క్ల‌బ్బుల్లో, ప‌బ్‌ల‌లో ఎక్క‌డ చూసినా ఈ జంట హ‌డావిడే క‌న‌ప‌డుతోంద‌ట‌.

ఇంత‌కు ఆ బ‌డా ఫ్యామిలీకి చెందిన యంగ్ హీరో ఇప్ప‌టికే మ‌రో బ‌క్క‌ప‌ల్చ‌ని హీరోయిన్‌తో ప్రేమాయ‌ణం కొన‌సాగించి..ఆమెతో చెట్టాప‌ట్టాలేసుకుని తిరుగుతూ మీడియాకు చాలాసార్లు అడ్డంగా దొరికిపోయారు. ఇప్పుడు ఆమెకు హ్యాండ్ ఇచ్చి ర‌కుల్‌ను ప‌ట్టేశాడు. ఇటీవ‌ల ర‌కుల్ హైద‌రాబాద్‌లో త‌న త‌మ్ముడితో ఓపెనింగ్ చేయించిన జిమ్‌కు, ఆమె కోటిన్న‌ర పెట్టి కొన్న హౌస్‌కు కూడా మ‌నోడు భారీగా డ‌బ్బు సాయం చేశాడ‌ట‌.

ఇక వీరిద్ద‌రు గోవా బీచ్‌లో ఎంజాయ్ చేసిన ఫొటోలు సైతం లీక్ అవ్వ‌డంతో ఈ వార్త‌ల‌కు మ‌రింత బ‌లాన్ని చేకూర్చిన‌ట్ల‌య్యింది. అంతేకాదు స‌ద‌రు కుర్ర హీరో లేటెస్ట్ సినిమాలో సైతం ఈ అమ్మ‌డే హీరోయిన్‌గా చేస్తోంది. ఇంత‌కు ఆ కుర్ర హీరో ఎవ‌రో ఈ పాటికే మీకు క్లారిటీ వ‌చ్చి ఉంటుంది అనుకుంటా..?