ఆ జిల్లా నుంచి ఎమ్మెల్సీగా లోకేష్ పోటీ..!

ఏపీ కేబినెట్ ప్ర‌క్షాళ‌న‌లో ఏపీ సీఎం చంద్ర‌బాబు త‌న‌యుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రాష్ట్ర ప్రభుత్వ పరిపాలనలో భాగం చేయడానికి మరో ముందడుగు పడింది. లోకేష్‌ను మంత్రిని చేయ‌డం దాదాపు ఖ‌రారైన సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలోనే లోకేష్‌ను ఎమ్మెల్యేల కోటాలో మండ‌లికి పంపుతార‌నే అంద‌రూ అనుకున్నారు. అయితే చంద్ర‌బాబు మాత్రం లోకేష్‌ను ఓ జిల్లా స్థానిక సంస్థ‌ల కోటాలో ఎమ్మెల్సీకి పంపాల‌ని డిసైడ్ అయిన‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి.

ఏపీలో టీడీపీ తిరుగులేని బ‌లంగా ఉన్న తూర్పుగోదావ‌రి జిల్లా స్థానిక సంస్థ‌ల నియోజ‌క‌వ‌ర్గం నుంచి లోకేష్‌న బ‌రిలోకి దిగ‌డం ఖాయ‌మైన‌ట్టు స‌మాచారం. ప్ర‌స్తుతం ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఎమ్మెల్సీగా ఉన్న టీడీపీ సీనియ‌ర్ లీడ‌ర్ బొడ్డు బాస్కర రామారావు పదవీ కాలం ముగిసింది. ఆ స్థానానికి మార్చి 17న ఎన్నికలు జ‌ర‌గ‌నున్నాయి. ఇదే క్ర‌మంలో త‌న‌కు మ‌రోసారి ఛాన్స్ ఇవ్వాల‌ని భాస్క‌ర రామారావు కోరుతున్నారు.

అయితే భాస్క‌ర రామ‌రావు మ‌ధ్య‌లో వైసీపీలోకి జంప్ అయ్యి తిరిగి టీడీపీలోకి రావ‌డం ఆయ‌న‌కు మైన‌స్‌గా మారింది. ఇక ఇదే జిల్లా నుంచి సీనియ‌ర్లు అయిన మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు – గన్ని కృష్ణ తదితరులు ఎవరి ప్రయత్నాల్లో వారు ఉన్నారు.

ఈ నేప‌థ్యంలోనే జిల్లా నుంచి ఎమ్మెల్సీ కోసం ట్రై చేస్తోన్న సీనియ‌ర్ల‌ను జిల్లాకే చెందిన మంత్రులు నిమ్మ‌కాయ‌ల చిన‌రాజ‌ప్ప‌, య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు తీవ్ర‌స్థాయిలో బుజ్జ‌గిస్తున్నారు. ఇక ఈ జిల్లా స్థానిక సంస్థ‌ల నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఎమ్మెల్సీగా పోటీకి రెడీ అవుతోన్న లోకేష్ ఈ నెల 28న నామినేష‌న్ దాఖ‌లు చేస్తార‌ని