ఆ టార్గెట్ ఒక్క రోజులోనే సాధ్యమైయేనా ..!

బాహుబ‌లి 2 సినిమాకు ప్ర‌స్తుతం ఉన్న క్రేజ్‌ను బ‌ట్టి చూస్తే తొలి షో నుంచే రికార్డుల వేట‌కు కొబ్బ‌రికాయ కొట్టేసిన‌ట్టు క‌నిపిస్తోంది. ఈ సినిమాకు జ‌రిగిన ప్రి రిలీజ్ బిజినెస్ చూస్తుంటే బాహుబ‌లి – ది కంక్లూజ‌న్ సినిమాకు ఉన్న క్రేజ్ తెలుస్తోంది. బాహుబ‌లి 2కు వ‌ర‌ల్డ్‌వైడ్‌గా రూ. 600 కోట్లు, ఏపీ+తెలంగాణ‌లో రూ.130 కోట్లు బిజినెస్ జ‌రిగింది.

ఓవ‌రాల్‌గా ఈ సినిమా రూ.1000 కోట్ల వ‌ర‌కూ వ‌సూలు చేయ‌డం ఖాయ‌మ‌ని ట్రేడ్ వ‌ర్గాలు లెక్క‌లు వేస్తున్నాయి. ఇండియ‌న్ సినిమా హిస్ట‌రీలో ఫ‌స్ట్ రూ.1000 కోట్ల సినిమాగా బాహుబ‌లి 2 నిల‌వ‌నుంద‌న్న అంచ‌నాలు కూడా స్టార్ట్ అయ్యాయి. సినిమాకు హిట్ టాక్ వ‌స్తే చాలు బాహుబ‌లి 2 అవ‌లీల‌గా వెయ్యి కోట్లు కొట్ట‌డం ఖాయం.

ఇదిలా ఉంటే టాలీవుడ్‌లో ప‌వ‌న్‌, మ‌హేష్ లాంటి స్టార్ హీరోల సినిమాలు ఫస్ట్ డే రూ. 25-30 కోట్ల వ‌ర‌కు వ‌సూలు చేస్తాయి. బాహుబ‌లి 1 అయితే రూ. 55 కోట్ల వ‌ర‌కు కొల్ల‌గొట్టింది. రెండు రోజుల‌కు రూ.100 కోట్లు పూర్తి చేసింది. ఇక ఇప్పుడు బాహుబ‌లి 2 రూ. 100 కోట్ల టార్గెట్ ఒక్క రోజులోనే సాధిస్తుంద‌ని ట్రేడ్ అంచ‌నా వేస్తోంది.

బాహుబ‌లి 2 బెనిఫిట్ షోలు భారీగా వేసేందుకు రంగం సిద్ధ‌మ‌వుతోంది. ఇక ఏపీలో అయితే తొలి 10 రోజులు 6 షోలు వేసుకునేందుకు ఏపీ స‌ర్కార్ అనుమ‌తి ఇచ్చింది.  ఈ లెక్క‌న ఈ సినిమా ఏపీ, తెలంగాణ‌లోనే తొలి రోజు రూ. 80 – 100 కోట్లు, వ‌ర‌ల్డ్‌వైడ్‌గా రూ. 200 కోట్ల‌కు పైగా వ‌సూళ్లు సాధిస్తుంద‌ని అంచ‌నా వేస్తున్నారు.