ఆ విషయం లో రెజీనా జబర్దస్త్

ఇటీవలిగా టాలీవుడ్‌లో ఓ మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ఓ సినిమాతో తమకేమీ సంబంధం లేకపోయినా సదరు చిత్రాన్ని ప్రమోట్‌ చేయడానికి ఇతర నటీనటులు ఉత్సాహం చూపుతున్నారు. ఈ లిస్ట్‌లో అందాల రెజీనా కసాండ్రా కూడా ఉంది

మొన్నామధ్య రాజా చెయ్యి వేస్తే సినిమా ప్రమోషన్ కోసం తారకత్నను ఇంటర్యూ చేసింది రెజీనా. ఆ సినిమాకీ ఈ బ్యూటీకి ఏం సంబంధం లేదు. తన ఉనికి లేకపోయినా కొన్ని చిత్రాల ఆడియో వేడుకలకు తరలివచ్చి సందడి చేసింది. తాజాగా ఈ సుందరి ‘బంతిపూల జానకి’ అనే సినిమా ఆడియో లాంచ్ కు హాజరై నటీనటుల్లో ఉత్సాహం నింపింది. ఈ సినిమాలో కమెడియన్ ధనరాజ్ .. ‘జబర్దస్త్’ ప్రోగ్రామ్‌ నటీనటులే ప్రధాన పాత్రలు పోషించారు. చిన్న చిత్రమే అయినా రెజీనా చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపేందుకు ఈ వేడుకకు తరలివచ్చింది. హీరోలనే కాక కమెడియన్లు చేసే సినిమాలను కూడా అమ్మడు ప్రమోట్ చేయడాన్ని అంతా మెచ్చుకుంటున్నారు.