ఆ వెబ్ సైట్ కి కబాలి కూతురి వార్నింగ్

ప్రపంచమంతా కబాలి నామస్మరణతో గత 2-3 రోజులుగా మార్మోగిపోయింది.ఇక తమిళనాడు..చెన్నై నగరం లో అయితే ఇది పీక్స్.అభిమానులు రాత్రంతా వేచి..తమ ఆరాధ్య నటుడి సినిమాకోసం బారులు తీరారు.రజినీకి ఇది కొత్తేమి కాదు కానీ కబాలి కి వచ్చిన క్రేజ్ ఒక్క తమిళ్ లోనే కాదు మొత్తం ఇండియా లోనే వేరే ఏ సినిమాకు రాలేదనే చెప్పాలి.అది సూపర్ స్టార్ రజిని అంటే.

అయితే సినిమా రిలీజ్ అవ్వడం డివైడ్ టాక్ రావడం చూస్తూనే వున్నాం మనందరం.అయితే సినిమా గురించి ఎప్పటికప్పుడు అభిమానుల్ని ఉత్సాహపరుస్తున్న రజిని కుమార్తె సౌందర్యకి ఓ వెబ్ సైట్ విషయం లో కోపమొచ్చింది.Indiaglitz అనే వెబ్ సైట్ ని ఆపేయండి అంటూ ట్విట్టర్ లో ఆవేశంగా స్పందించింది సౌదర్యం.ఇంతకీ ఆ వెబ్ సైట్ ఎం చేసిందో తెలుసా.సినిమా చూస్తూ లైవ్ అప్ డేట్స్ ని పెట్టింది.లైవ్ అంటే అలా ఇలా కాదు.రజిని వచ్చాడు,గ్యాంగ్ లోకి ఎంటర్ అయ్యాడు,స్కూల్ స్టార్ట్ చేసాడు ఇలా స్టోరీ మొత్తం పూసగుచ్చినట్టు నిమిష నిమిషానికి సైట్ లో పెట్టేసింది.

అంతే సౌందర్యకు కోపమొచ్చింది.ఆ సైట్ ని ఆపెయండంటూ ట్విట్టర్ లో స్పందించింది.అభిమానులని సినిమా చూసి సొంతంగా అనుభూతి చెండనివ్వండి అంటూ ఘాటుగా రియాక్ట్ అయ్యింది.అవును నిజమే ఎలాగూ అభిమానులు సినిమా చూస్తారు కదా.అంతకు ముందే వీళ్ళ రన్నింగ్ కామెంటరీ ఏంటని పలువురు అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇంకేముంది బిత్తర పోయిన సదరు వెబ్ సైట్ యాజమాన్యం సౌందర్య కి క్షమాణ చెప్పి వెంటనే లైవ్ కామెంటరీ ని ఆపేసింది.