ఇప్పటికీ ఇదే నా ఫేవరెట్ ఫోటో

పవన్ కళ్యాణ్ మాజీ భార్య,అకిరా నందన్ తల్లి రేణు దేశాయ్ పవన్ పై తనకున్న ప్రేమాభిమానాలని,తీపిజ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు.ట్విట్టర్ వేదికగా రేణు దేశాయ్ పోస్ట్ చేసిన ఒక ఫోటో వైరల్ గా మారింది.పవన్ అస్తమిస్తున్న సూర్యుడి వైపు చూస్తూ ఎదో ఆలోచిస్తుండగా ఈ ఫోటోని క్లిక్ మనిపించింది రేణు.

ఈ ఫోటోని రేణు 2010 లో స్వయంగా తీశానని..అప్పుడే కొన్న 5D కెమెరాతో దేన్నీ క్లిక్ మనిపించానని చెప్పుకొచ్చింది.ఈ ఫోటో ఇప్పటికీ తన ఫేవరెట్ ఫోటో అంటూ రేణు ట్వీట్ చేసింది.సెప్టెంబర్ 2 న పవన్ పుట్టిన రోజు సందర్భంగా ఈ ఫోటో ను షేర్ చేశానని చెప్పింది.ఈ ఫోటో ఒరిజినల్ అని దీన్ని కనీసం ఎడిట్ కూడా చేయలేదని చెప్పింది.

పవన్ కళ్ళలో కనిపించే ఆ తీవ్రతని నాకు చాలా ఇష్టమని చెప్పింది రేణు.లాస్ట్ ఇయర్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజుకి కూడా తానే స్వయంగా తీసిన , యెల్లో డ్రెస్ లో ఉన్న ఫోటోలను షేర్ చేశానని..ఈసారి పుట్టినరోజుకి తన ఫేవరెట్ ఫోటో ని షేర్ చేస్తున్నానని తీపి జ్ఞాపకాలను గుర్తుచేసుకుంది రేణు దేశాయ్.