ఎన్టీఆర్ పై భారీ అభిమానం చూపిస్తున్న హీరోయిన్స్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి యంగ్ హీరోయిన్స్ లో మంచి గుర్తింపు వుంది. ఈ తరం హీరోస్ లో ఎన్టీఆర్ మాస్ ఇమేజే డిఫరెంట్ అది ఈమధ్యకాలంలో చాలా కనిపిస్తుంది. మొన్న జనతా గ్యారేజ్ ఆడియో ఫంక్షన్ లో నిత్యా మీనన్ మాట్లాడుతూ ఎన్టీఆర్ లాంటి పెద్ద హీరోతో చేయటం ఇదే మొదటిసారి అంది.

అయితే నిత్యామీనన్ ఇంతకు ముందే అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరో తో చేసింది అయినా ఆలా చెప్పటం తో ఎన్టీఆర్ ని తాను ఎలా చూస్తుందో వ్యక్తమయింది. ఇదిలావుంటే నిన్న ఒక ప్రెస్ మీట్ లో సమంత కూడా తన పాతజ్ఞ్యాపకాలను గుర్తు చేసుకుంటూ మొదటి సినిమా ‘ఏమాయ చేసావే’ నాగచైతన్య లాంటి చిన్న హీరోతో చేసి తరువాత ఎన్టీఆర్ లాంటి పెద్ద హీరో తో అవకాశం అంటే ముందు భయపడ్డా అని చెప్పి తనకి ఎన్టీఆర్ పై వున్న అభిమానాన్ని చెప్పింది. ఇదంతా చూస్తుంటే యంగ్ టైగర్ కి యంగ్ హీరోయిన్స్ లో ఏ  రేంజ్ లో క్రేజ్ ఉందొ తెలుస్తుంది కదా.