`ఎన్టీఆర్ బయోపిక్`ఎంతవరకూ ఉంటుందంటే..ప్రతీ విషయం సంచలనమే!!

త‌న తండ్రి స్వ‌ర్గీయ నంద‌మూరి తార‌క రామారావు బ‌యోపిక్ తీస్తాన‌ని, అందులో తాను న‌టించ‌బోతున్నానంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశాడు నంద‌మూరి బాల‌కృష్ణ‌. అప్ప‌టి నుంచి అంద‌రిలోనూ ఎన్నో సందేహాలు త‌లెత్తాయి! ఈ సినిమా ఎక్క‌డి ఉంటుంది?  అందులో చంద్ర‌బాబు పాత్ర ఎంత వ‌ర‌కూ చూపిస్తారు? ఆయ‌న బాల్యం నుంచి చ‌నిపోయే వ‌రకూ చూపిస్తారా?  లేదా అనే ఎన్నో ప్ర‌శ్న‌లు మెదిలాయి. కానీ ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన స‌రికొత్త స‌మాచారం ఏంటంటే.. ఇందులో ఎన్టీఆర్ సీఎం అయినంత‌ర‌కూ మాత్ర‌మే చూపించ‌బోతున్నార‌ని స‌మాచారం.

సినీ రంగంతో పాటు అందర్నీ ఆకర్షించిన ప్రకటన.. ఎన్టీయార్‌ బయోపిక్‌ తీస్తామని బాలకృష్ణ ప్రకటించడం. ఎన్టీఆర్ జీవితంలో ప్ర‌తీ అంశం ఆస‌క్తిక‌ర‌మే! న‌టుడిగా మొద‌లైన ప్ర‌స్థానం ఉన్న‌త శిఖ‌రాల‌ను అధిరోహించ‌డం.. త‌ర్వాత రాజ‌కీయాల్లో ఎన్నో ఎత్తుప‌ల్లాలు చూసిన ఆయ‌న జీవితం నిజంగానే.. ఆస‌క్తిక‌రం! దీంతో ఆయ‌న జీవితాన్ని వెండి తెర‌పై తీస్తాన‌ని ప్ర‌క‌టించ‌డంతో ఎవరిని విలన్‌గా చిత్రీకరిస్తారు? ఎక్కడి వరకు తెరకెక్కిస్తారు అనే ప్రశ్నలు బయల్దేరాయి. అయితే ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన స్ర్కిప్టు వర్క్‌ పూర్తయినట్టు సమాచారం.

ఎన్టీయార్‌ నిమ్మకూరులో ఇంటింటికి తిరిగి పాలు అందించిన దగ్గర్నుంచి, చెన్నయ్‌ రావడం, టాప్‌స్టార్‌గా ఎదగడం, రాజకీయాల్లోకి రావడం, కేంద్రంలో కాంగ్రెస్‌ను ఎదురించి, రాష్ట్రంలో అధికారంలోకి రావడం వరకు ఈ సినిమా ఉంటుందనే విషయం తెలుస్తోంది. ఈ సినిమాకు ‘ప్రస్థానం’ డైరెక్టర్‌ దేవ్‌కట్టా దర్శకత్వం వహించే అవకాశాలున్నాయని వినిపిస్తోంది. మ‌రి ఈ విషయంలో అధికారికంగా ప్ర‌క‌టించేవ‌ర‌కూ ఈ సినిమాపై వ‌స్తున్న ప్ర‌తీ విష‌యం సంచ‌ల‌న‌మే!!