ఎమ్మెల్యే అవుతానని సవాల్ చేసిన కళ్యాణ్ రామ్

నంద‌మూరి యంగ్ హీరో క‌ళ్యాణ్‌రామ్ ఎమ్మెల్యే అవుతున్నాడ‌ట‌. నంద‌మూరి ఫ్యామిలీకి ఎలాగూ పొలిటిక‌ల్‌గా బ‌ల‌మైన బ్యాక్‌గ్రౌండ్ ఉంది. దీంతో క‌ళ్యాణ్ త‌మ సొంత పార్టీ టీడీపీ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాడా ? అన్న డౌట్లు రాక‌మాన‌వు. ఇక తాను ఎమ్మెల్యే అవుతున్నాన‌ని క‌ళ్యాణ్ ఎంపీతో ఛాలెంజ్‌ చేసి మరీ చెబుతాడట. అయితే ఇదంతా రియల్‌ లైఫ్‌లో కాదు.. రీల్‌ లైఫ్‌లో.

ప్ర‌స్తుతం త‌న సోద‌రుడు ఎన్టీఆర్ హీరోగా త‌న సొంత బ్యాన‌ర్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యాన‌ర్‌లో ఓ సినిమా (వ‌ర్కింగ్ టైటిల్ జై ల‌వ కుశ‌) నిర్మిస్తోన్న క‌ళ్యాణ్ తాను హీరోగా రెండు సినిమాల‌కు గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చాడు. ఈ క్ర‌మంలోనే శ్రీనువైట్ల దగ్గర అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేసిన ఉపేంద్ర తయారుచేసిన ఈ కథకు కళ్యాణ్‌రామ్ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చేశాడట.

ఈ సినిమా స్టోరీ ప్ర‌కారం క‌ళ్యాణ్ ఓ ఎంపీతో తాను ఎమ్మెల్యే అవుతాన‌ని మ‌రీ సవాల్ చేస్తాడ‌ట‌. ఇందుకోసం చాలా వెరైటీ…వెరైటీ ప‌థ‌కాలు ప్ర‌వేశ‌పెడ‌తాడ‌ట‌. ఇలా ఈ క‌థ‌లో ఎంపీ వ‌ర్సెస్ క‌ళ్యాణ్‌మ‌ధ్య ఎత్తులు పైఎత్తుల‌తో క‌థ‌నం చాలా ఆస‌క్తిక‌రంగా ఉంటుంద‌ట‌.

ద‌ర్శ‌కుడు ఉపేంద్ర ఈ కథను సునీల్‌ కోసం తయారు చేశాడట. సునీల్‌ బాడీ లాంగ్వేజ్‌కు అనుగుణంగా సీన్లు రాసుకున్నాడట. ఇప్పుడు కల్యాణ్‌రామ్‌ వద్దకు ఈ కథ చేరడంతో అందుకు అనుగుణంగా సీన్లు, డైలాగులు మారుస్తున్నాడట. మ‌రి రీల్ లైఫ్‌లో క‌ళ్యాణ్ ఎమ్మెల్యేగా ఎలాంటి సంచ‌ల‌నం క్రియేట్ చేస్తాడో చూడాలి.