కంగనా నేర్పుతున్న జీవిత పాఠం

ఇప్పుడు బాలీవుడ్‌ క్వీన్‌గా చెలామణీ అవుతోన్న ముద్దుగుమ్మ కంగనా రనౌత్‌ సెన్సేషనల్‌ వ్యాఖ్యలతో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. ఆమె ఇంత స్టార్‌డమ్‌ సంపాదించుకోవడానికి చాలా కష్టపడింది. అంత కష్టపడి మెట్టూ మెటూ పైకెక్కి ఇప్పుడు బాలీవుడ్‌ని ఏలుతోంది. అందుకే ఆమె జీవితం చెప్పిన పాఠాలనే తనలాంటి ఆడపిల్లల కోసం అప్పుడప్పుడూ బయట పెడుతూ ఉంటుంది కంగనా. సినీ పరిశ్రమలోకి వచ్చిన ఆడవారిని చాలా చిన్నతనంగా చూస్తారు మగవారు. ఆ ధోరణి పోవాలి అని గట్టిగా చెబుతోంది ఈ ముద్దుగుమ్మ.

మీడియా వాళ్లు పుట్టించే రూమర్స్‌ని పట్టించుకుని మూలన కూర్చుంటే ఎప్పటికీ కెరీర్‌లో విజయం సాధించలేం. అందుకే వాటన్నింటినీ పట్టించుకోకుండా మనం ఏంటని నిరూపించుకోగలిగితే సక్సెస్‌ దానంతటదే వస్తోంది. ఆ తరువాత ఇలాంటి రూమర్స్‌ అన్నీ ఆ సక్సెస్‌ ముందు బలాదూర్‌ అంటోంది. ప్రస్తుతం ‘కట్టీ బట్టీ’ సినిమాలో నటిస్తోన్న ఈ ముద్దుగుమ్మ సమాజానికి తాను ఎంచుకునే పాత్రల ద్వారా ఎంతో కొంత మేలు జరగాలనే తాను భావిస్తానంటోంది. అందుకే ఆమె చేసే పాత్రలన్నీ జనానికి దగ్గరగా ఉంటాయి. కంగన జస్ట్‌ యాక్ట్రెస్‌ కాదు, మోడలింగ్‌ రంగం నుంచి సినిమాల్లోకి వచ్చింది. మోడలింగ్‌ రంగంలో టామ్‌ బాయ్‌ అనిపించుకున్న ఈ బ్యూటీ సినిమాల్లో కూడా అదే పేరు తెచ్చుకుంది. లవ్‌ ఫెయిల్యూర్‌ కూడా ఉందామె లైఫ్‌లో. ‘నేను మహిళను’ అన్నదాన్ని బలంగా తీసుకోవాలి తప్ప, వీక్‌నెస్‌గా భావించరాదని సాటి మహిళలకు కంగన క్లాస్‌ తీసుకుంటోంది.