కబాలి ” రివ్యూ “

టాగ్ లైన్ : అభిమానులకి మరో “భాషా”
TJ రేటింగ్ : 3/5
సినిమా: క‌బాలి
న‌టీన‌టులు: ర‌జ‌నీకాంత్‌, రాధికాఆఫ్టే, నాజ‌ర్ త‌దిత‌రులు
బ్యాన‌ర్‌: వీ క్రియేష‌న్స్‌, ష‌ణ్ముఖ ఫిలింస్‌
సంగీతం: స‌ంతోష్ నారాయ‌ణ‌న్‌
సినిమాటోగ్ర‌ఫీ: జీ ముర‌ళీ
ఎడిటింగ్‌: కేఎల్‌.ప్ర‌వీణ్‌
నిర్మాత‌: క‌లైపులి ఎస్‌.థాను
కథ,ద‌ర్శ‌క‌త్వం: పా. రంజిత్‌
థియేటర్ వాచ్డ్: ఏషియన్ GPR – స్క్రీన్ -3

మొత్తానికి సూపర్ స్టార్ బయటొచ్చాడు.ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన అభిమానుల్ని అలరించడానికి వచ్చేసాడు.ఎన్నో రూమర్లు,గాసిప్ లు ,ఇంకెన్నో ఫీలర్లు వెరసి కబాలి వచ్చేసింది.అన్ని సరే ఇంతకీ సినిమా ఎలా ఉందంటే బావుంది..అలాగని అబ్బో సూపర్ అనేంతగా లేదు..అలాగని అమ్మో అనుకునేంత భారంగా కూడా లేదు.

సినిమా చూస్తున్నంత సేపు మనం కబాలి చుస్తున్నామా లేక అప్పట్లో రజిని సంచలనం ‘బాషా’ ని చుస్తున్నామా అనే భావన కలుగుతుంది.కాకపోతే ఇది లేటెస్ట్ వెర్షన్ ఆఫ్ బాషా అంతే తేడా..మిగతాదంతా సేమ్ టు సేమ్.

కథ చాలా సింపుల్. బ్రతుకుతెరువు కోసం మలేసియా వెళ్లినా ఓ భారతీయుడు అనుకోని పరిస్థితుల్లో ప్రజల తరపున నిలబడి అక్కడ డాన్ గా ఎలా ఎదిగాడు..తన సర్వస్వాన్ని కోల్పోయి జైలు కెలా వెళ్ళాడు.తిరిగి పోయిందన్న తన జీవితాన్ని, తన వాళ్ళందరిని ఎలా దక్కించుకున్నాడు,నేరసామ్రాజ్యాన్ని ఎలా అంతం చేసాడన్నది అసలు కథ. కథ కొత్తదేమీ కాదు.బాషా లో ఇదే కథని వేరేలా చూసాం.ఒక బాషా ఏంటి మనకు గ్యాంగ్ స్టర్ సినిమాలు కోకొల్లలు.ఇది అందులో ఒకటే.కాకపోతే ఇది సూపర్ స్టార్ రజిని సినిమా అంతే తేడా.

సినిమా ఎక్కడికో వెళ్తుంది అనుకునే లోపే కిందకి పడేస్తాడు దర్శకుడు..అంతలోనే మల్లి లేపుతాడు మొదటి నుండి చివరివరకు ఇదే తంతు..సినిమా మొత్తానికి రజిని మేనరిజంస్ అదిరిపోయాయాయి.చెప్పాలంటే ఇవి చాలు కాసులు కురిపించడానికి. అసలు రజిని జైల్లో ఇంట్రడక్షన్ సీన్ సినిమా మొత్తానికే హై లైట్..అక్కడొక షాట్ ఉంటుంది..రజిని జైలు గది బయట అడుగు పెట్టబోతు ఆగి వెనక్కి వచ్చి ఓ రెండు ఫుల్ అప్స్ తీయడం వావ్ అనిపిస్తుంది..ఇంకా టీజర్ లో చూపించిన డైలాగ్స్ ‘కబాలి డా’ ముందు వెనక వచ్చే సన్నీవేశాలు అద్భుతంగా చిత్రీకరించారు.

సినిమా మొత్తం రజినీకాంత్ నే చూస్తుంటాం తెరపైన..అంత స్క్రీన్ టైం వుంది రజినీకి ఈ సినిమాలో. అది పెద్ద ప్లస్ పాయింట్ సినిమాకి..ఇంత వయసొచ్చినా ఆ నడకా..ఆ స్టైల్..ఆ నవ్వు.ఆ చిలిపి చేష్టలు ఆ ఎనర్జీ వేరెవ్వరికీ సాధ్యం కాదు.దట్ ఈస్ రజిని.సూపర్ స్టార్ కి మొత్తం మూడు షేడ్స్ వున్నాయి..మూడిట్లోనూ అంతే చార్మింగ్ గా వున్నాడు రజిని.

సినిమాకి పాటలు లేకపోవడం కథా పరంగా మంచిదే కానీ వున్న రెండు పాటలు ఫర్లేదనిపించాయి..మిగతా నటీనటులు ఎవరిపరిధిలో వాళ్ళు పర్లేదనిపించారు.రజిని భార్యగా రాధికా ఆప్టే అద్భుతంగా నటించింది.సినిమాలో ప్రత్యేక కామెడీ ట్రాక్ అంటూ ఏమి లేదు.కథా పరంగా కూడా కామెడీ కి పెద్దగా అవకాశం లేదు.బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది.స్క్రీన్ ప్లే అక్కడక్కడా బాగుందనిపిస్తుంది.మొత్తం మలేసియా గ్యాంగ్ వార్ ఎపిసోడ్స్ ఇంకా బాగా తీసుండాల్సింది.ఇంకొంచెం టైట్ స్క్రీన్ ప్లే ఉండుంటే సినిమా వావ్ అనిపించుండేది.

చెప్పుకోదగ్గ డైలాగ్స్ లేవు కానీ సినిమాలో రజిని నవ్వు మేనరిజంస్ తో వాటిని కనపడనీయలేదు.అయినా ఒక డైలాగు ఉంటుంది..మహాత్మా గాంధీ చొక్కా విప్పడానికి ,,అంబేత్కర్ కోటు వేసుకోవడానికి పెద్ద రాజకీయమే ఉందని ఓ మాటుంటాది.అంతకు మించి మాటలు గురించి మాట్లాడుకోవడానికి పెద్దగా ఏమిలేదు.కాకపోతే క్లైమాక్స్ లో దర్శకుడికి పెద్ద చిక్కొచ్చినట్టనిపిస్తుంది.నెగిటివ్ క్లైమాక్స్ ఇస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచన..రజినీకి నెగిటివ్ క్లైమాక్స్ ఆ అన్న భయం తో అటు ఇటు కానీ ముగింపు ఇచ్చేసి ప్రేక్షకుల్ని ఆలోచించుకోండి అనేసినట్టనిపిస్తుంది.

మొత్తంగా సినిమా రజిని ఫీస్ట్ అనే చెప్పాలి..కాకపోతే ఇంకా ఏదో కొత్తదనం కోరుకున్న ప్రేక్షకులకి రజిని సినిమా కూడా అదే అరిగిపోయిన మసాలా మూవీ అనే సరికే కొంచెం డిసప్పోఇంట్ అవుతారు.మొత్తానికి సూటు బూటు, గన్స్,బ్లడ్,ఫైట్స్ తో రజిని రెచ్చిపోయాడు.మాస్ ప్రేక్షకులకి ఈ సినిమా కనులవిందు..అయితే సగటు సినీ అభిమాని ఎంతవరకు రిసీవ్ చేసుకుంటాడా అనేది ఆసక్తికరంగా వుంది..సో లెట్స్ వెయిట్ అండ్ సీ.