కబాలి స్టోరీ అంతా అక్కడేనా!

రజనీకాంత్‌తో ‘కబాలి’ సినిమా ప్రారంభమైనప్పుడే ఇదో మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో సాగే కథాంశమని దర్శకనిర్మాతలు చెప్పేశారు. తాజాగా దీనికి సంబంధించి దర్శకుడు పా రంజిత్ మరిన్ని వివరాలు వెల్లడించాడు. తమ సినిమాలో హీరో పూర్తి పేరు కబలీశ్వరన్. బ్రిటీష్ పాలన సమయంలో ఆయన కుటుంబం మలేసియాకు వలస వెళ్తుంది.

మలేసియాలోనే పెరిగి పెద్దవాడైన కబాలిని అక్కడి భారతీయ కార్మికుల కష్టాలు కదిలిస్తాయి. వారి సంక్షేమం కోసం కబాలి ఏం చేశారన్నదే తమ సినిమా అని రంజిత్ వివరించాడు. ‘కబాలి’ మాఫియా నేపథ్యంలోనే సాగినా అంతా పాజిటివ్‌గానే ఉంటుందని చెప్పాడు. కబాలిగా రజనీకాంత్ నటన అందరినీ ఉర్రూతలూగిస్తుందని తెలిపాడు.