కాటమరాయుడు టాక్ వచ్చేసింది

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త సినిమా రివ్యూ వచ్చేసింది. తమిళ్ లో “వీరం” పేరుతో అజిత్ నటించిన ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఇప్పుడు అదే సినిమా తెలుగులో పవన్ కళ్యాణ్ హీరోగా కాటమరాయుడు గా రేపు ప్రేక్షకులముందుకు రానుంది. అయితే ఈ  సినిమా గురించి యూకే, యూఏఈ సెన్సార్ బోర్డ్ సభ్యుడు, ఇండియన్ సినిమా మేగజైన్ యూకే అండ్ యూఏఈ ఎడిటర్ ఉమైర్ సంధూ ఒక శుభవార్త చెప్పాడు.

Katamarayudu-review

కాటంరాయుడు ఫస్ట్ రివ్యూ ఇదేనని తన ట్విట్టర్ అకౌంట్ లో  సినిమా సూపర్ హిట్ అని చెప్పి 4 /5 రేటింగ్ కూడా ఇచ్చేసారు. సినిమా పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ అని అభిమానులకు పిచ్చిపిచ్చిగా నచ్చుతుందని ఫామిలీ ఆడియన్సు ని కూడా ఆకట్టుకునే సన్నివేశాలున్నాయని చెప్పారు. ఫైట్స్   అదిరిపోయాయని రీమేక్ సినిమా అయినప్పటికీ చూసేవారికి ఎక్కడ ఆ ఫీలింగే ఉండదని చెప్పారు.