కాటమ రాయుడు గెటప్ ఇదిగో

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ కి స్మాల్ బ్రేక్ ఇచ్చి తన తదుపరి సినిమా షూటింగ్ లో నిమగ్నమయ్యారు.గబ్బర్ సింగ్ , అత్తారింటికి దారేది వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ తరువాత వచ్చిన సర్దార్ గబ్బర్ సింగ్ అభిమానుల్ని నిరాశ పర్చి బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడిన విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో పవన్ అభిమానులంతా ఎప్పుడెప్పుడు పవన్ తదుపరి సినిమా వస్తుందా అంటూ ఎదురుచూస్తున్నారు.

అనేక మలుపులు,విరామాలు తరువాత ఈ మధ్యనే పవన్ కళ్యాణ్ లేటెస్ట్ మూవీ కాటమ రాయుడు సెట్స్ పైకి వెళ్ళింది.ఈ షూటింగ్ లో పవన్ ఈ పాటికే జాయిన్ అయినట్టు సమాచారం.పవన్ కళ్యాణ్ కాటమ రాయుడు గెటప్ లో ఉన్న ఫోటో ఒకటి బయటికొచ్చింది.రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యం లో సాగే ఈ కథలో పవన్ గెటప్ కూడా అచ్చం ఫ్యాక్షన్ లీడర్ లాగే అభిమానుల్ని అలరిస్తోంది.

ఇక ఈ సినిమాకి గోపాల గోపాల ఫెమ్ డాలీ దర్శకత్వం వహిస్తుండగా,పవన్ స్నేహితుడు శరత్ మరార్ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.ఇక ఈ సినిమాలో గబ్బర్సింగ్ హిట్ తో తనది పవన్ తో హిట్ పెయిర్ అనిపించుకున్న శృతి హాసన్ ఈ కాటమ రాయుడితో మరో సారి జతకడుతోంది.ఏ రకంగా చూసినా ఈ సినిమా పవన్ కెరీర్ లో మరో మైలురాయిగా నిలుస్తుందని అటు అభిమానులు ఇటు సగటు సినీ ప్రేక్షకుడు అప్పుడే లెక్కలుకట్టేస్తున్నారు.