కావేరి మంటల్లో చలి కాచుకుంటున్న మోడీ

దక్షిణాది రాష్ట్రాలైన కర్ణాటక తమిళనాడులు భగ్గుమంటున్నాయి..కేవెరి జల వివాదం తో రెండు రాష్ట్రాలు రావణ కాష్టం లా తగలబడి పోతున్నాయి..సుప్రీం కోర్ట్ తీర్పు నేపథ్యం లో మొదట కన్నడ నాట అల్లర్లు చెలరేగగా మెల్లిగా అవే అల్లర్లు తమిళనాట కూడా ప్రారంభమయిపోయాయి..రెండు రాష్ట్రాలు శత్రు దేశాల మాదిరి రాకపోకలు నిలిపివేసే పరిస్థి వచ్చిందంటే కావేరి తీవ్రత ఏ రేంజ్ లో ఉందొ ఊహించుకోవచ్చు

ప్రజల మధ్య విద్వేషాలు రగిలిపోతున్నాయి.అసలు ఈ విషయం తో ఏ సంబంధం లేని సామాన్యులు అనుభవిస్తున్న క్షోభ వర్ణించలేనిది.ఆస్తి నష్టం అయితే అంతు లేదు.అమాయకుల్ని పట్టుకుని దారుణంగా చితకబాదుతుంటే అసలు ప్రభుత్వాలున్నది ఇందుకేనా అనిపిస్తుంది.ఒక లారీ డ్రైవర్ ని ఒక చోట,ఓ వ్యాన్ డ్రైవర్ ని మరోచోట చావబాదుతుంటే బాధితులు దణ్ణం పెడుతున్నా చావగొడుతుంటే..ఇవి కేవలం ఎవరో మొబైల్ లో తీసి బయటపడ్డ దృశ్యాలే..ఇవి కాక ఇంకెన్ని దాడులు జరిగాయో మనం ఊహించుకోవచ్చు.. ఇదేనా ప్రజాస్వామ్యం అంటే.. వీళ్లేనా మన పాలకులు అంటే ఛీ అనిపిస్తుంది.

2014 ఎన్నికలకు ముందు మోడీ జపం చేసిన యావత్ భారతావని ఇప్పుడు అదే మోడీ తానేమి రాజకీయాలకు అతీతుడిని కాదని..కాకపోతే మాములు రాజకీయనాయకులు నిర్మొహమాటంగా రాజకీయం చేస్తే..మోడీగారు మాత్రం ముసుగేసుకుని రాజకీయం చేస్తారు అంతే తేడా..మొదటిది వంచన అయితే మోడీ గారిది నయవంచనే.లేకపోతే దక్షిణాదిన రెండు రాష్ట్రాలు అగ్నికి ఆహుతయిపోతూ ప్రజల్లో విద్వేషాలు పెచ్చురిల్లిపోతోంటే..రెండు రోజులాగి తాపీగా ఆవేదన వ్యక్తం చేశారు ప్రధాని మోడీ గారు..ఇలాంటి సమయం లోనే ప్రజలంతా సంయమనం పాటించాలని పిలుపునిచ్చేసి విజ్ఞప్తి చేసేసి చేతులు దులిపేసుకున్నారు..ఇక మన బొంకయ్య నాయుడు మరో అడుగు ముందుకేసి హింస ప్రతి హింసలతో సమస్యలు పరిష్కారం కాదూ.. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలంటూ హితోపదేశం చేసే పడేసారు.అయ్యా మోడీ అండ్ వెంకయ్యా మీరు ఏమి చేయకపోయినా పర్లేదు కానీ సూక్తులు మాత్రం చెప్పకండి..వినే ఓపిక ఎవ్వరికీ లేదు.

నిజంగా మనమంతా సిగ్గుపడాలి..ఇలాంటి మనిషినా భారతావనంతా ముక్తకంటం తో ప్రధాని కావాలని కోరుకుని మరీ గద్దెనెక్కించిందని..బీజేపీ పాలిత రాష్ట్ర మయితే ఒక లెక్క కాకుంటే మరో లెక్క.ఉత్తర భారత దేశమయితే ఓ లెక్క..దక్షిణ భారత రాష్ట్రమయితే ఇంకో లెక్క ..గుజరాత్ అయితే ఓ లెక్క తక్కిన రాష్ట్రాలయితే ఓ లెక్క.అసలు పార్టీ కి భవిష్యత్ ఉన్న రాష్ట్రమయితే ఓ లెక్క..పార్టీ ఏ లేని రాష్ట్రమయితే ఇంకో లెక్క.సింపుల్ గా ఇది మన ప్రధాని మోడీ గారి లెక్క.

వంచన..నయవంచన..సరికొత్త రాజకీయ వంచన..నొప్పి తెలీయకుండా గొంతుకోసేస్తున్నారు..దేశ సమగ్రతకే ఈ కావేరి వివాదం పెను ముప్పు అన్నది నిర్వివాదాంశం..ఇలాంటి టైం లో కూడా రాజకీయాలెక్కలేసుకుని ఆచి తూచి స్పందిస్తుంటే నిజంగా సిగ్గు పడాల్సిన విషయం..సూటు బూటు వేసుకుని విదేశాలు తిరిగేసి ప్రపంచ దేశాలతో సంబంధాలు మెరుగు పరచుకోవడమే కాదు సొంతింట్లో సమస్యల్ని సమస్యలుగా చూడడం నేర్చుకుంటే మోడీ గారికి బీజేపీ పార్టీ భవిష్యత్ కె మంచిది.కాంగ్రెస్ నుండి ఎప్పుడూ ప్రజలు ఏమీ ఆశించరు..ప్రత్యామ్నాయం లేని రోజున దేశం మొత్తానికి మళ్ళీ కాంగ్రెస్ ప్రత్యామ్నాయం..అదే సామాన్యుడి ఆశల పల్లకి మోయగా పీఠమెక్కిన బీజేపీ ఒక్క సారి కిందపడితే పాతాళానికి పోవడం తప్ప పైకి లేవడం అంటూ ఉండదు.