కోహ్లీకి ప్రొపోజ్ చేసిన అమ్మాయిని చంపేశారు

వరల్డ్ కప్ T20 జరుగుతున్నప్పుడు ఓ పాకిస్థానీ అమ్మాయి పోస్ట్ చేసిన వీడియో సంచలనం రేపింది గుర్తుందా.ఆమె ఎవరో కాదు ప్రముఖ పాకిస్థానీ మోడల్‌, సోషల్‌ మీడియా సెలబ్రిటీ అయిన ఖందీల్‌ బలోచ్‌.ఈ మధ్య కాలం లో పాకిస్థాన్ లో బాగా పాపులర్ అయిన ఖందీల్‌ బలోచ్‌ ఈ రోజు హత్యకు గురైనట్లు పోలీసులు వెల్లడించారు.

బలోచ్ T20 వరల్డ్ కప్ జరుగుతున్నప్పుడు ఓ వీడియో పోస్ట్ చేసి సంచలనంగా మారింది.ఆ వీడియో లో కోహ్లీ అంటే తనకు ఇష్టమని, అనుష్క శర్మ ని వదిలేసి తనను ప్రేమించాలని కోహ్లీని కోరింది. ఇండియా పాకిస్థాన్ వరల్డ్ కప్ మ్యాచ్ లో విరాట్ ని చూసి ఫిదా అయిపోయానని, విరాట్ లవ్ యూ..ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ లవ్ మీ బేబీ,నాగురించి ఆలోచించు అంటూ యూట్యూబ్ లో పెద్ద సంచలనం రేపింది. ఇంకా అప్పట్లో అఫ్రీదీని తిడుతూ, ఏడుస్తూ ఆమె పెట్టిన వీడియో చాలా వైరల్ అయ్యింది.అంతే కాకుండా T20 వరల్డ్ కప్ పాక్ గెలిస్తే బలోచ్ నగ్నంగా డాన్స్ చేస్తానని కూడా ప్రకటించింది.ఇవే కాదు యూట్యూబ్ వేదికగా బలోచ్ అనేక వీడియోలు పోస్ట్ చేసి బాగా పాపులర్ అయ్యింది.

వీడియో కోసం క్లిక్ చేయండి

రంజాన్ పండుగను సొంత ఇంట్లో జరుపుకోవడానికి ముల్తాన్ వచ్చిన ఈమెని ఇంట్లోనే సోదరుడు చంపేసినట్లు తెలుస్తోంది.బలోచ్ కి ఇదివరకే ఆన్లైన్ లో ఫోటోలు పెట్టడంపై సోదరుడు ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది.కాగా మోడలింగ్ చెయ్యిద్దని ఆమెకి ఆన్లైన్ లో అనేక సార్లు బెదిరింపులు రావడం వాటిపై అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయింది.