క్రేజీ రామ్ అంటున్న కరుణాకరన్ !

ఒక సినిమాలో హిట్టయిన పాట పల్లవే ఆ తర్వాత సినిమా టైటిల్‌గా మారిపోవడం మామూలే. రామ్ కూడా ఇదే బాటలో నడుస్తున్నాడు. తన లేటెస్ట్ హిట్ నేను శైలజలో సూపర్ హిట్టయిన ఇట్స్ ఎ క్రేజీ క్రేజీ క్రేజీ క్రేజీ ఫీలింగ్ పాటలోంచి తన తర్వాతి సినిమాకు టైటిల్ తీసుకున్నాడు. క్రేజీ ఫీలింగ్ ఇదీ రామ్ హీరోగా స్రవంతి రవికిషోర్ నిర్మించబోయే సినిమా టైటిల్.

ఆయన ఫిలిం ఛాంబర్లో ఈ టైటిల్ రిజిస్టర్ చేయంచారు. ఇంకా అఫీషియల్ గా టైటిల్ అనౌన్స్ చేయలేదు. ఈ చిత్రానికి కరుణాకరన్ దర్శకత్వం వహిస్తాడు. హైపర్ తర్వాత రామ్ నటించే సినిమా ఇదే కావచ్చు.కరుణాకరన్ ఇంతకుముందే రామ్ తో పనిచేశాడు. వీళ్లిద్దరి కాంబినేషన్లో ఎందుకంటే ప్రేమంట వచ్చింది. ఆ చిత్రాన్ని నిర్మించింది కూడా రవికిషోరే. కానీ ఆ సినిమా పెద్ద ఫ్లాపైంది.

అయినా మరోసారి సేమ్ కాంబినేషన్లో సినిమా రాబోతుండటం విశేషమే. లవ్ స్టోరీలు తీయడంలో స్పెషలిస్టు అయిన కరుణాకరన్.. మరోసారి తన స్టయిల్లోనే సినిమా చేయబోతున్నాడు. ఇందులో హీరోయిన్ ఎవరన్నది ఇంకా ఖరారవ్వలేదు. మరోవైపు అనిల్ రావిపూడి దర్శకత్వంలోనూ రామ్ ఓ సినిమా చేయాల్సి ఉంది. కాకపోతే ఆ సినిమానుకొన్ని కారణాల వల్ల హోల్డ్ లో పెట్టినట్లు వార్తలొస్తున్నాయి. హైపర్ ఈ నెల 30న ప్రేక్షకుల ముందుకొస్తుంది.