ఖైదీ నెంబర్ 150 ఖాతాలో మరో రికార్డు

మెగాస్టార్ చిరంజీవి దాదాపు తొమ్మిదేళ్ళ తర్వాత హీరోగా రీ ఎంట్రీ ఇచ్చిన సినిమా ఖైదీ నెంబ‌ర్ 150. కోలీవుడ్‌లో హిట్ అయిన విజ‌య్‌-మురుగ‌దాస్ క‌త్తి సినిమాకు రీమేక్‌గా తెర‌కెక్కిన ఈ సినిమా సంక్రాంతి కానుక‌గా భారీ అంచ‌నాల మ‌ధ్య ఈ నెల 11న రిలీజ్ అయ్యింది. భారీ అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్టే ఖైదీ రెండు తెలుగు రాష్ట్రాల‌తో పాటు ఓవ‌ర్సీస్‌లో కూడా అంచ‌నాల‌కు మించి వ‌సూళ్లు సాధిస్తోంది.

తొలి రోజు 4700 థియేట‌ర్ల‌లో రిలీజ్ అయిన ఖైదీ అమెరికాలో ప్రీమియ‌ర్ల‌తోనే మిలియ‌న్ మార్క్ ట‌చ్ చేసింది. ఈ క్ర‌మంలోనే ఖైదీ నెంబ‌ర్ 150 ఖాతాలో మరో రికార్డు చేరింది. ఇప్పటివరకూ యూఎస్‌లో ఈ సినిమా 2 మిలియన్ డాలర్లు వసూలు చేసి ఈ రికార్డును త‌న ఖాతాలో వేసుకుంది.

ఈ వారంతంలో కూడా ఖైదీ అక్క‌డ మంచి వ‌సూళ్లు సాధించ‌డంతో ఖైదీ దూకుడు కంటిన్యూ అవుతోంది. ఇక యూఎస్‌లో 2 మిలియ‌న్ డాల‌ర్ల క్ల‌బ్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న బాహుబలి, శ్రీమంతుడు, అ..ఆ.. సినిమాల సరసన ఖైదీ కూడా

చేరిపోయింది. లాంగ్‌రన్‌లో ఖైదీ నెంబ‌ర్ 150 శ్రీమంతుడు  (2.8మిలియన్ డాలర్లు) రికార్డును బ్రేక్ చేసి 3 మిలియన్ వసూలు చేస్తుందని ట్రేడ్ వ‌ర్గాలు అంచ‌నా వేస్తున్నాయి.