గ్యారేజ్ రిలీజ్ డేట్ మారడానికి ఆయనే కారణం

జనతా గ్యారేజ్ రిలీజ్ డేట్ కన్ఫ్యూషన్ లో వున్నా అభిమానులకు ఎట్టకేలకు ఫైనల్ డేట్ గా సెప్టెంబరు 1 ని చిత్ర యూనిట్ కంఫర్మ్ చేసింది. అయితే అనుకున్న దానికన్నా ఒకరోజు ముందే ఈ సినిమా సందడి చేయనున్నందుకు అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది .అయితే.. అసలు జనతా గ్యారేజ్ రిలీజ్ డేట్ ముందుకు జరగడం వెనకాల ఓ ప్రముఖ నిర్మాత ఉన్నారని టాక్. ఆ నిర్మాత మరెవరోకాదు దిల్ రాజు అని ఫిలింనగర్ సమాచారం. ముందు అనుకున్న ప్రకారం ఈ సినిమా సెప్టెంబర్ 2 న విడుదల కావాల్సి వుంది.ఆ రోజు బంద్ వున్నా ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ రోజు విడుదల చేయాలన్న నిర్ణయంతో ఉంది చిత్ర బృందం.

సినిమా పోస్ట్ ప్రొడక్షన్ సహా అన్ని పనులూ పూర్తవడంతో ఒక్కరోజు ముందే సినిమాను విడుదల చేస్తే కలెక్షన్లు పెంచుకోవచ్చని జూనియర్ ఎన్టీఆర్‌కు సూచించారట. ఆయన మాటలతో నిర్మాతలుకూడా ఏకిభవించటంతో సినిమాని సెప్టెంబర్ 1 న విడుదల చేసేందుకు సిద్ధమయ్యారు. అయితే సెప్టెంబరు 1 నుంచి 5 వరకు వరుస సెలవులుండడంతో జనతా గ్యారేజ్ కలెక్షన్లకు హెల్ప్ అవుతుందని అనుకుంటున్నారు.